బెంగళూరు vs హైదరాబాద్: ఇల్లు కొనుగోలుపై టెకీల మధ్య సీరియస్ డిబేట్.. చివరకు ఏం తేలిందంటే..

వయసు 20 సంవత్సరాల నుంచి మధ్య నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువ టెకీలకు ఈరోజుల్లో ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా.. సొంతింటి కల.. అయితే ఆ ఇల్లు ఎక్కడ కొనాలి.. ఏ ఏరియాలో కొంటే అనువుగా ఉంటుంది అనే సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా బెంగళూరులో ఖరీదైన ఇల్లు కొనడం మంచిదా? లేక హైదరాబాద్‌లో స్థిరమైన భవిష్యత్తుకై పెట్టుబడి వేయడమే స్మార్ట్ ఎంపికా? అనే అంశాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

ఈ చర్చకు ఇటీవల Reddit వంటి ఆన్‌లైన్ ఫోరమ్‌లలో చాలా మంది యువ టెకీలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈటెకీ ఉద్యోగులు అంతా ఈ రెండు ప్రధాన ఐటీ నగరాల మధ్య ఉన్న వ్యత్యాసాలను చర్చిస్తున్నారు. బెంగళూరులో మంచి కెరీర్ అవకాశాలు, స్టార్టప్ కల్చర్ ఉంది. కానీ ట్రాఫిక్ భయంకరం, ఇంటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, నగరం చెత్తగా ప్లాన్‌ చేయబడిందని ఒక 25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

Bengaluru vs Hyderabad real estate techies buying first home best city for tech homebuyers Hyderabad real estate 2025 Bengaluru property prices first-time homebuyers India tech professionals housing choice Hyderabad vs Bangalore property affordable homes for techies IT employees property guide Bengaluru Hyderabad housing comparison 2025

హైదరాబాద్‌లో మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, తక్కువ ఖర్చు, కేంద్రీకృత ఐటీ హబ్‌లు ఉన్నా... స్టార్టప్‌లు, ప్రొడక్ట్ కంపెనీలు బాగా లేవని మరొక టెకీ చెబుతున్నారు. అలాగే బెంగళూరును చాలామంది భారత స్టార్టప్, టెక్ రంగానికి కేంద్రంగా భావిస్తున్నారు. కానీ, ధరలు, ట్రాఫిక్ సమస్యలు, నీటి కొరత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ రెండు పడక గదుల ఇంటికి కూడా ధరలు కోటి రూపాయలు దాటుతున్నాయని పలువురు టెకీలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

ఐటీ ప్రాంతాలు (వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, ORR) చాలా దూరాల్లో ఉండటం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సరిగ్గా లేని పరిస్థితి వల్ల కమ్యూనికేషన్ ఇంకా కష్టంగా మారిందంటున్నారు. బెంగళూరు బ్రేకింగ్ పాయింట్‌కు చేరుకుంటోంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడడానికి సంవత్సరాల సమయం పడుతుందని మరికొందరు చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఆకర్షణగా మారుతోందని వారంటున్నారు.

హైదరాబాద్ నగరంలో బాగా ప్లాన్ చేసిన రోడ్లు, తక్కువ రియల్ ఎస్టేట్ ధరలు, గచ్చిబౌలి, హెచ్‌ఐటిఇసీ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కేంద్రీకృత ఐటీ జోన్‌లు ఇవన్నీ ప్లస్ పాయింట్లు అని చెబుతున్నారు. పైగా బెంగళూరు కన్నా 20-30% తక్కువ ధరకు నగరంలో పెద్ద ఇల్లు పొందడం సాధ్యమవుతుందని అంటున్నారు. అయితే కెరియర్ పరంగా చూసుకుంటే.. బెంగళూరు ఇప్పటికీ ముందుంది. ముఖ్యంగా స్టార్టప్, నిచ్ డొమెయిన్‌లు ఉన్న టెక్ ప్రొఫెషనల్స్‌కు అడ్డాగా మారుతుందని ఇది హైదరాబాద్ నగరానికి మైనస్ అని చెబుతున్నారు.

2025 జనవరి-మార్చి మధ్యలో హైదరాబాద్‌లో గల గట్టి డిమాండ్ ఉన్న ప్రాంతాలు 8% ధరల పెరుగుదలను చూశాయి. బంజారాహిల్స్‌లో చదరపు అడుగు ప్రస్తుత ధరలు రూ. 12,000-రూ. 15,000 కు పెరిగాయి. మాధాపూర్, గచ్చిబౌలిలో కూడా రేట్లు చదరపు అడుగుకు రూ. 8,000-రూ. 8,250 వరకు చేరుకున్నాయి.అదే బెంగళూరులో ప్రధాన ప్రాంతాల్లో ధరలు ఇప్పటికే రూ. 13,000-రూ.15,000కు చేరాయి. బయట ప్రాంతాలు అయినా కూడా రూ. 9,000-రూ. 10,000 పరిధిలోనే ఉన్నాయి. అయితే, రెంటల్ రిటర్న్స్ విషయానికి వస్తే - బెంగళూరులో ROI సాధారణంగా 3%-4%, హైదరాబాద్‌లో ఇది 3%-3.5% మధ్య ఉందని చెబుతున్నారు.

అయితే రెండు నగరాలను చూసుకుంటే.. ఇప్పుడు చాలామంది కొనుగోలుదారులు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నారు, ప్రధాన కారణం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదలలు. బెంగళూరులో ట్రాఫిక్, వరద సమస్యలు పెట్టుబడి చేయాలన్న ఆసక్తిని తగ్గిస్తున్నాయని మెజార్టీ టెకిలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైమైనా మీ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని సెలవిస్తున్నారు. కెరీర్ గ్రోత్, స్టార్టప్ కల్చర్ కోరుకునే వారికి బెంగళూరు.. విలువకు తగ్గ ఇల్లు, జీవన నాణ్యత, ట్రాఫిక్ లేని జీవితం కోరుకునే వారికి హైదరాబాద్ ఉత్తమం అని నిపుణులు టెకీలకు మార్గదర్శక సూచన చేస్తున్నారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+