బెంగళూరు.. దేశంలోనే బెస్ట్ మెట్రో పాలిటర్ సిటీల్లో ఒకటి. గత ఎన్నో ఏళ్లుగా ఈ నగరం అపార్ట్‌మెంట్ సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటోంది. అయితే గార్డెన్ సిటీలో ప్రస్తుతం ఒక కొత్త సమస్య తలెత్తుతోంది. నగరంలోని 'సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్' (CBD) , మల్లేశ్వరం వంటి ప్రాంతాల్లో 30 నుండి 40 ఏళ్ల నాటి పాత అపార్ట్‌మెంట్ లు ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయి. వాహనాలకు 15 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ టెస్ట్ తప్పనిసరి చేసినట్లుగానే.. పాతబడిన భవనాలకు కూడా కఠినమైన నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

బెంగళూరు (Bengaluru) నగరంలో వయసైపోయిన పాత బిల్డింగులు.. అంటే 1970, 80 వ దశకాల్లో నిర్మించిన అనేక అపార్ట్‌మెంట్‌లు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలపై పగుళ్లు, తుప్పు పట్టిన పైపులు, లీకేజీ సమస్యలతో నివాసితులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. మల్లేశ్వరం, ఉల్సూర్ రోడ్, ఎంజీ రోడ్ వంటి కీలక ప్రాంతాల్లోని ఈ భవనాల్లో లిఫ్ట్ లు, ఆధునిక పార్కింగ్ సదుపాయాలు కూడా లేకపోవడం మరో ప్రధాన లోపం. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం 'కర్ణాటక అపార్ట్‌మెంట్ ఓనర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ (KAOMA 2025)' ను తీసుకురాబోతోంది.
కొత్త చట్టం ఏం చెబుతోంది?
బెంగళూరు అపార్ట్‌మెంట్స్ ఫెడరేషన్ (BAF) ప్రకారం.. ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి అపార్ట్‌మెంట్ తప్పనిసరిగా 'స్ట్రక్చరల్ ఆడిట్' (నిర్మాణ నాణ్యత పరీక్ష) చేయించుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ పరీక్షను పునరావృతం చేయాలి. భవనం నివసించడానికి సురక్షితం కాదని తేలితే, రీడెవలప్‌మెంట్ చేయడం తప్పనిసరి అవుతుంది. మహారాష్ట్ర తరహాలో ఇక్కడ కూడా రీడెవలప్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.
రీడెవలప్‌మెంట్ లో అడ్డంకులు.. ఎందుకీ నిరసనలు?
చాలా చోట్ల భవనం కూలిపోయే స్థితిలో ఉన్నా, కొందరు యజమానులు రీడెవలప్‌మెంట్ ను అడ్డుకుంటున్నారు. పాత జ్ఞాపకాలు, అదనపు విస్తీర్ణం కోసం డిమాండ్లు లేదా డెవలపర్లపై నమ్మకం లేకపోవడం దీనికి కారణం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఒక్క యజమాని అభ్యంతరం చెప్పినా ప్రాజెక్ట్ ఆగిపోతుంది. కానీ, KAOMA 2025 ప్రకారం, మెజారిటీ యజమానులు (ఉదాహరణకు 50% పైగా) అంగీకరిస్తే రీడెవలప్‌మెంట్ కు అనుమతి ఇచ్చేలా నిబంధనలు సవరించే అవకాశం ఉంది.
ఏది ఏమైనా బెంగళూరు (Bengaluru) లో వయసైపోయిన అపార్ట్‌మెంట్ లు ఆధునిక హంగులతో కొత్త రూపు సంతరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కేవలం భవనాల అందం కోసం మాత్రమే కాదు, నివాసితుల ప్రాణ రక్షణ కోసం కూడా అత్యవసరం. కర్నాటక ప్రభుత్వం మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఒకవేళ ఇది చట్టరూపం దాల్చితే.. బెంగళూరు (Bengaluru) లోని పలు అపార్ట్ మెంట్ వాసులకు పరోక్షంగా మేలు జరిగినట్టే.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications