బెంగళూరు ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్.. 16 ఏళ్ల తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్‌పై బైక్‌లకు టోల్ ఫ్రీ..

Bengaluru News: ఐటీ రాజధాని బెంగళూరులో ప్రతిరోజూ ప్రయాణించే వేలాది మంది ద్విచక్ర వాహనదారులకు త్వరలోనే ఒక తీపి కబురు అందే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుండి ఎలక్ట్రానిక్స్ సిటీని కలిపే 10 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌పై ద్విచక్ర వాహనాలకు టోల్ రుసుము నుండి సంపూర్ణ మినహాయింపు ఇచ్చే దిశగా భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) పరిశీలన జరుపుతోంది. కాంట్రాక్టు గడువు ఈ నెల సెప్టెంబర్ 10తో ముగియడంతో.. ఈ ప్రాజెక్టు నిర్వహణను ఎన్‌హెచ్‌ఏఐ అధికారికంగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ మార్పుతో గత 16 ఏళ్లుగా టోల్ చెల్లిస్తున్న సుమారు 25,000 మందికి పైగా రోజువారీ ద్విచక్ర వాహనదారులకు భారం తగ్గనుంది.

2010లో ప్రారంభమైన ఈ ఎలివేటెడ్ కారిడార్ ఎలక్ట్రానిక్స్ సిటీ, బొమ్మసంద్ర, అట్టిబెళి వైపు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులకు సులభమైన సిగ్నల్-రహిత మార్గాన్ని అందిస్తోంది. ప్రస్తుతం బెంగళూరు నగరంలో ద్విచక్ర వాహనాల నుండి టోల్ వసూలు చేస్తున్న అతికొద్ది రహదారులలో ఇది ఒకటిగా ఉంది. ప్రస్తుతం బైకర్లు ఒక వైపు ట్రిప్‌కు రూ. 25, రోజువారీ పాస్‌కు రూ. 40, నెలవారీ పాస్ కోసం రూ. 785 చొప్పున చెల్లిస్తున్నారు. ఈ టోల్ ప్లాజా వద్ద రోజూ దాదాపు 30,000కు పైగా ద్విచక్ర వాహనాల లావాదేవీలు నమోదవుతుండటం దీని ప్రాధాన్యతను తెల్పుతోంది.

Bengaluru news Bengaluru toll news Electronics City flyover Electronics City toll two-wheeler toll bike toll NHAI toll rules Bengaluru traffic Bengaluru toll-free ride Electronics City elevated corridor NHAI takeover two-wheeler toll exemption 25 toll Bengaluru flyover toll-free bike ride Karnataka traffic news Two Wheeler Toll NHAI NHAI Toll Rules Electronics City Toll Bengaluru Traffic

ఈ మార్పుకు ప్రధాన కారణం నిర్వహణ నిబంధనలలో వస్తున్న నూతన మార్పులేనని ఎన్‌హెచ్‌ఏఐ సీనియర్ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టును నిర్వహించిన బెంగళూరు ఎలివేటెడ్ టోల్‌వే సంస్థ 1997 నాటి పాత టోల్ విధానం ప్రకారం ద్విచక్ర వాహనాల నుండి రుసుము వసూలు చేసేది. అయితే ఎన్‌హెచ్‌ఏఐ ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడంతో 2008 జాతీయ రహదారుల టోల్ విధానం వర్తిస్తుంది. ఈ నిబంధనల ప్రకారం జాతీయ రహదారి మార్గాలలో ద్విచక్ర వాహనాలకు టోల్ చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది. కాగా ఇదే సమయంలో 60 కిలోమీటర్ల పరిధిలోనే ఎలక్ట్రానిక్స్ సిటీ మరియు అట్టిబెలె వద్ద రెండు టోల్ ప్లాజాలు ఉండటంపై వాహనదారులు చాలాకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Also Read

ఈ సవరణల వల్ల కార్లు, బస్సులు మరియు ఇతర భారీ వాహనాల టోల్ రేట్లలో స్వల్ప మార్పులు లేదా సవరణలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హోసూర్ రోడ్డుపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఐటీ కంపెనీలు మరియు కర్ణాటక ప్రభుత్వ అభ్యర్థన మేరకు నిర్మించిన ఈ కారిడార్‌పై ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడానికి ఎన్‌హెచ్‌ఏఐ సమూల మార్పులు యోచిస్తోంది. సాంప్రదాయ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగే అవసరం లేకుండా, నేరుగా టోల్ వసూలు చేసే 'మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్' (MLFF) సాంకేతికతను ప్రవేశపెట్టడం లేదా ప్లాజాను పునర్‌వ్యవస్థీకరించడం వంటి ప్రత్యామ్నాయాలపై ఎన్‌హెచ్‌ఏఐ తుది నిర్ణయం తీసుకోనుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+