కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) అంటేనే అందరికీ ఒక పెద్ద భయం. అదే ట్రాఫిక్. అక్కడ గంటల కొద్దీ రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ "నమ్మ మెట్రో" జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. రాబోయే రెండేళ్లలో బెంగళూరు మెట్రో నెట్‌వర్క్‌లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ప్రకటించారు. 2026 మే నుంచి డిసెంబర్ లోపు అదనంగా 41.01 కిలోమీటర్ల మెట్రో లైన్లు అందుబాటులోకి రానున్నాయి.

2026లో ఏయే లైన్లు ప్రారంభం కానున్నాయి?
మెట్రో అధికారుల ప్లాన్ ప్రకారం.. 2026 సంవత్సరం బెంగళూరు వాసులకు చాలా ప్రత్యేకం కానుంది..
- మే 2026: పింక్ లైన్‌లోని కాలేన అగ్రహార నుంచి తావరేకెరె వరకు (6 స్టేషన్లు) ఎలివేటెడ్ విభాగం ప్రారంభం అవుతుంది.
- డిసెంబర్ 2026: డెయిరీ సర్కిల్ నుంచి నాగవార వరకు ఉన్న 13.76 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ లైన్ (12 స్టేషన్లు), సిల్క్ బోర్డ్ జంక్షన్ నుంచి కె.ఆర్ పురం వరకు ఉన్న 19.75 కిలోమీటర్ల లైన్ (ఫేజ్ 2A) అందుబాటులోకి వస్తాయి.
దీనివల్ల ప్రస్తుతం ఉన్న 96.1 కిలోమీటర్ల మెట్రో పొడవు కాస్తా 137.11 కిలోమీటర్లకు చేరుకుంటుంది.
ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎప్పుడు వస్తుంది?
బెంగళూరు (Bengaluru) విమానాశ్రయానికి వెళ్లాలంటే ఇక ట్యాక్సీల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. 2027 జూన్ నాటికి హెబ్బాల్ నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 27 కిలోమీటర్ల లైన్ సిద్ధమవుతుంది. అదే ఏడాది డిసెంబర్‌లో హెబ్బాల్-కె.ఆర్ పురం మార్గం కూడా పూర్తవుతుంది. దీంతో 2027 ముగిసేసరికి బెంగళూరు మెట్రో నెట్‌వర్క్ ఏకంగా 175.55 కిలోమీటర్లకు విస్తరిస్తుంది.
దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్!
మెట్రో ఫేజ్-3 కోసం సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా దేశంలోనే అతి పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్‌ను నిర్మించనున్నారు. జేపీ నగర్ 4వ ఫేజ్ నుంచి కెంపాపుర వరకు, హోసహల్లి నుంచి కడబగెరె వరకు ఈ కొత్త లైన్లు ఉంటాయి. దీనికి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) సుమారు రూ. 6,775 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు అంగీకరించింది.
శివార్ల వరకు మెట్రో విస్తరణ..
నగరం నడిబొడ్డునే కాకుండా బిడది, నెలమంగళ, హోస్కోటె, తావరేకెరె వంటి శివారు ప్రాంతాలకు కూడా మెట్రోను మరో 100 కిలోమీటర్ల మేర పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ఫిజిబిలిటీ స్టడీ నివేదికలు త్వరలోనే రానున్నాయి. అలాగే మాదవర నుంచి తుమకూరు వరకు 59.6 కిలోమీటర్ల మెట్రో లైన్ కోసం హైదరాబాద్‌కు చెందిన 'ఆర్వీ ఇంజనీరింగ్' సంస్థ డీపీఆర్ (DPR) సిద్ధం చేస్తోంది.
ఏదేమైనా ట్రాఫిక్ కష్టాలతో సతమతమవుతున్న బెంగళూరు (Bengaluru) ఐటీ ఉద్యోగులకు అలాగే సామాన్యులకు ఈ మెట్రో విస్తరణ పెద్ద ఊరట. ముఖ్యంగా ఆగస్టు 2025లో ప్రారంభమైన ఎల్లో లైన్ ఇప్పటికే ఎలక్ట్రానిక్ సిటీ ఏరియాలో 30% ట్రాఫిక్‌ను తగ్గించిందని గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే ప్రాజెక్టులతో గార్డెన్ సిటీ మరింత స్పీడ్ అందుకోనుంది!
More From GoodReturns

Bengaluru: యాపిల్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. కానీ ఈ టెక్కీ ఆటో ఎందుకు నడుపుతున్నాడో తెలుసా?

ఒకప్పుడు మ్యాగీ తింటూ గడిపాడు! నేడు నెలకు రూ. 3.5 లక్షల సంపాదిస్తున్నాడు!

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!

Bengaluru: ఉద్యోగం కంటే సొంత వ్యాపారమే మిన్న.. ఒంటరిగా వంట చేస్తూ నెటిజన్ల మనసు గెలిచిన టెక్కీ!

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Bengaluru: బెంగళూరులో రూ. 500తో రోజంతా గడపడం సాధ్యమేనా? ఈ యువతి ఏం చేసిందో చూడండి!

Vande Bharat: బెంగళూరు టూ ముంబై వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది! రూట్ మ్యాప్ ఇదే!

Bengaluru: రోడ్లు చూస్తే గుంతలు.. బడ్జెట్ చూస్తే వేల కోట్లు! అసలు డబ్బు అంతా ఎటు వెళ్తోంది?

Bengaluru: ఇన్వెస్టర్లకు పండగే: బెంగళూరులోని ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ భారీగా జంప్!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్‌లో ఉన్నారేమో చూసుకోండి!



Click it and Unblock the Notifications