Bengaluru News: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఐటీ రంగంలో పనిచేస్తున్న యువత బెంగళూరు నగరంలో పనికోసం వెళుతుంటారు. ఇప్పటికే చాలా మంది అక్కడే స్థిరపడిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇండియన్ సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న ప్రజలకు సుఖం కంటే కష్టాలే ఎక్కువగా వెంటాడుతున్నాయి.
కర్ణాటకను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి నీటి కొరత. ఇప్పటికే బెంగళూరులో నివసిస్తున్న తెలుగు ప్రజలను భారీగా పెరిగిన ఇంటి అద్దెలు వెంటాడుతున్న వేళ త్వరలో ప్రారంభం కానున్న వేసవి కూడా భయపెడుతోంది. గత ఏడాది ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను గుర్తుపెట్టుకున్న బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఈ సారి పరిస్థితులు అంత దిగజారక మునుపే చర్యలను ప్రారంభించింది. నీటి వినియోగానికి సంబంధించి ప్రజలకు కొన్ని పరిమితులను ప్రకటించింది.

రానున్న సమ్మర్ లో ప్రజలకు తాగు నీటి ఎద్దడి రాకుండా నివారించటానికి మున్సిపల్ కార్పొరేషన్ కీలక సూచనలు చేసింది. దీని ప్రకారం ప్రజలు నీటిని గార్డెనింగ్, కార్లను క్లీన్ చేయటానికి, నగరంలో నిర్మాణ పనులు చేపట్టడానికి వినియోగించకూడదని హెచ్చరించింది. పైన పేర్కొన్న పనులకు నీటిని వృధా చేయవద్దని నిషేధిస్తూ బెంగళూరు నీటి సరఫరా బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. కమర్షియల్ వినియోగదారులైన మాల్స్, సినిమా హాల్స్ నీటిని అనవసరంగా వినియోగించరాదని కూడా పేర్కొంది.
అలాగే బెంగళూరులో వేసవిలో రోడ్డు శుభ్రపరచడం, రోడ్డు నిర్మాణ పనులకు తాగునీటిని ఉపయోగించకూడదని కఠిన ఆంక్షలు విధించింది. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే వారిపై రూ.5000 జరిమానా విధించబడుతుందని తన ప్రకటనలో మున్సిపాలిటీ పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలను పంచుకోవటానికి 1916 నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు అందించవచ్చని వెల్లడించింది. దాదాపు దశాబ్ధకాలంగా బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో అనేక ప్రాంతాలు 100 శాతం భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ పరిస్థితులు ప్రజలకు నీటి కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.
ప్రధానంగా బెంగళూరు నగరంలో 80 వార్డుల్లోని ప్రజలు గ్రౌండ్ వాటర్ పైనే ఆధారపడి ఉన్నారని తాజా రిపోర్టులు వెల్లడించాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ రోజురోజుకూ తగ్గిపోవటం వేసవిలో వాటర్ ట్యాంకులపై ఆధారపడాల్సిన పరిస్థితులు కల్పిస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గత ఏడాది ప్రజలు కనీసం వంటకు సైతం నీరు దొరకని పరిస్థితులను చూడటంతో ఇంటి అద్దెకు అదనంగా నీటి ట్యాంకర్ల కోసం భారీగా ఖర్చు చేశారు. ఇది నగరంలో అద్దెకు ఉంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపై అదనపు భారాన్ని గత వేసవిలో కలిగించింది.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications