Bengaluru Metro Rail Update: బెంగళూరు నగరంలో నమ్మ మెట్రో ఎల్లో లైన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు సగటున 60 వేల మందికి పైగా ప్రయాణికులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం కేవలం మూడు రైలు సెట్లు మాత్రమే నడుస్తుండటంతో.. రైలు కోసం ప్రయాణికులు 20 నుంచి 25 నిమిషాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రద్దీ సమయాల్లో కోచ్‌లు పూర్తిగా నిండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిస్థితినుంచి బయటపడేందకు త్వరలో వారికి ఉపశమనం కలిగించే వార్త రాబోతోంది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) నాలుగో రైలు సెట్‌ను సెప్టెంబర్ రెండవ వారం నాటికి తీసుకురావాలని యోచిస్తోంది. గత నెలలో నగరానికి చేరుకున్న ఈ రైలు అధికారులు పెట్టిన ప్రధాన పరీక్షల్లో విజయవంతం అయింది. అధికారులు చెబుతున్న ప్రకారం.. వాణిజ్య సేవలకు రైలు సిద్ధం కావడానికి కనీసం 750 కిలోమీటర్ల ట్రయల్ రన్‌లు పూర్తిచేయాలి. అవసరమైన పరీక్షలు మరో వారం రోజుల్లో పూర్తవుతాయని..సెప్టెంబర్ మధ్య నాటికే ఈ రైలు ప్రయాణికుల సేవలోకి వస్తుందని బీఎంఆర్‌సిఎల్ ధృవీకరించింది.

టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ చైనాకు చెందిన CRRC నాన్జింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఈ రైళ్ల ఉత్పత్తి చేస్తోంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఐదవ రైలు సెట్ కూడా సెప్టెంబర్ మధ్య నాటికి బెంగళూరుకు చేరే అవకాశం ఉంది. అయితే.. CRRC నుండి బోగీల సరఫరాలో ఆలస్యం కారణంగా ఆరవ రైలు సెట్ తయారీ కనీసం 2-3 వారాలు వెనక్కి వెళ్లే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. చైనా నుండి వచ్చే వీల్‌సెట్‌లు, ట్రాక్షన్ మోటార్లు, గేర్‌బాక్స్‌లు, సస్పెన్షన్ సిస్టమ్‌లు వంటి కీలక భాగాల డెలివరీలో జాప్యం ప్రధాన సమస్యగా మారింది.
ఈ జాప్యాన్ని అధిగమించడంపై బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య కీలక అప్ డేట్ ఇచ్చారు. ఆయన టిటాగఢ్ రైల్ సిస్టమ్స్ ఎండీతో మాట్లాడి.. సెప్టెంబర్ 30 నాటికి కనీసం ఎనిమిది రైలు సెట్లు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బోగీలు తప్ప మిగతా భాగాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, వీటిని CRRC చైనా నుండి త్వరగా తెప్పిస్తేనే డెలివరీ సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
ఎంపీ సూర్య ప్రకారం.. రెండు రైళ్లకు అవసరమైన బోగీలను ఎయిర్‌ఫ్రైట్ ద్వారా తెప్పించడం తప్ప వేరే ఆచరణాత్మక పరిష్కారం లేదని స్పష్టం చేశారు. సముద్ర మార్గం ద్వారా రవాణా చేస్తే 30-45 రోజుల వరకు ఆలస్యం అవుతుందని.. దాంతో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఎంఆర్‌సిఎల్ వెంటనే చర్యలు తీసుకుని వస్తువులను విమానాల ద్వారా రవాణా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సకాలంలో రైళ్లు అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు సౌకర్యం పెరుగుతుంది. బీఎంఆర్‌సిఎల్‌కు అదనపు ఆదాయం కూడా వస్తుందని సూర్య X (ట్విట్టర్)లో వ్యాఖ్యానించారు.ఈ కొత్త రైళ్లు అనుకున్న సమయానికి అందుబాటులోకి వస్తే ఎల్లో లైన్‌లో రైలు ఫ్రీక్వెన్సీ గణనీయంగా పెరుగుతుంది. దీంతో బెంగళూరు దక్షిణ, తూర్పు ప్రాంతాల నుండి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌కు ప్రయాణించే లక్షలాది మందికి వేగవంతమైన రవాణా సౌకర్యం లభించే అవకాశం ఉంది.
More From GoodReturns

Bengaluru: పల్లెటూరి నుంచి గూగుల్ వరకు.. తండ్రిని ఆఫీసుకు తీసుకెళ్లిన కొడుకు, నెటిజన్ల ఫిదా!

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

ఫ్రిజ్‌లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో నరకం చూశాం: యుద్ధం మధ్య చిక్కుకున్న పీవీ సింధు ఎమోషనల్ పోస్ట్!

Bullet train: మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్! సౌత్ ఇండియాలో రాబోయే రూట్లు ఇవే..



Click it and Unblock the Notifications