Bengaluru Metro Rail Update: ఆగస్టు 10న ప్రారంభమైన నమ్మ మెట్రో ఎల్లో లైన్ (ఆర్‌వి రోడ్-బొమ్మసంద్ర) కేవలం మూడు వారాల్లోనే వేలమంది ప్రయాణికులను ఆకర్షించింది. ప్రారంభం నుంచే ఈ 19 కి.మీ.ల మార్గంలో సగటున రోజుకు 60వేల మంది ప్రయాణికులు మెట్రోను ఉపయోగిస్తున్నారని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ధృవీకరించింది. ప్రారంభ రోజుల్లో 50 వేల నుంచి 58 వేల మంది ప్రయాణికులు మాత్రమే ఎక్కినా.. తదుపరి వారాల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఎల్లో లైన్‌లో కేవలం మూడు రైళ్లు మాత్రమే, ప్రతి 25 నిమిషాలకు ఒక్కసారి నడుస్తున్నప్పటికీ.. వినియోగదారులు తగ్గకుండా మరింతగా పెరుగుతున్నారు. తక్కువ ఫ్రీక్వెన్సీ కారణంగా ప్రయాణికులు తగ్గిపోతారని మేము అనుకున్నాం. మొదటి రద్దీ తర్వాత రోజువారీ ప్రయాణికులు 30 వేల మందికి పడిపోతారని ఊహించాం. కానీ అది జరగలేదు. ప్రజలు ఫ్రీక్వెన్సీని పెద్ద సమస్యగా తీసుకోవడం లేదని ఒక సీనియర్ BMRCL అధికారి తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వారాంతాల్లో ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం రద్దీ.. ఉదయం కంటే 20 శాతం ఎక్కువగా ఉండటమే ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణమైంది. ఈ లైన్‌ను ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ సిటీ, బొమ్మసంద్ర వంటి ప్రాంతాలకు వెళ్తున్న ఉద్యోగులు ఉపయోగిస్తున్నారు. ఉదయం వారు క్యాబ్‌లను ఎంచుకున్నా, తిరుగు ప్రయాణానికి మాత్రం మెట్రోలో ప్రయాణానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.రాబోయే రెండు-మూడు వారాల్లో ఎల్లో లైన్‌లో నాలుగో రైలు చేరికతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఫ్రీక్వెన్సీ తగ్గడం వలన ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
ఎల్లో లైన్ ప్రారంభంతో బొమ్మసంద్ర నుండి MG రోడ్ వరకు రోడ్డు ట్రాఫిక్‌లో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ఒక ఐటీ ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకుంటూ.. ముందు ఆఫీసుకి వెళ్లేందుకు గంటా 45 నిమిషాలు పట్టేది. ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత ప్రయాణ సమయం 30 నిమిషాలు తగ్గింది. కేవలం గంటా 10 నిమిషాల్లో ఆఫీసుకి చేరుతున్నానని తెలిపారు. ప్రయాణానికి రోజుకు సుమారు రూ.300-400 ఖర్చవుతున్నప్పటికీ సమయ ఆదా కారణంగా మెట్రోను ఎంచుకోవడంలో తాను వెనుకడుగు వేయడంలేదని చెప్పారు.
ఇక మెట్రో ప్రభావం ఆటో డ్రైవర్లకు కూడా కనిపిస్తోంది. బనశంకరి ఆటో డ్రైవర్ వినాయక్ కుమార్ మాట్లాడుతూ..ఇప్పుడు మాకు ఎక్కువగా ఎల్లో లైన్‌కు కనెక్ట్ కాని ప్రాంతాలకే రైడ్ అభ్యర్థనలు వస్తున్నాయి. రోజువారీ IT ఉద్యోగులు రాత్రి ఇంటికి తిరిగి వెళ్లడానికి ఆటో బుక్ చేసుకునేవారు. ఇప్పుడు వాళ్లు నేరుగా మెట్రో ఎక్కుతున్నారని అన్నారు.
తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పటికీ.. ఎల్లో లైన్ బెంగళూరులో విజయవంతం అయింది. రాబోయే వారాల్లో కొత్త రైళ్లు చేరికతో సేవలు ఇంకా మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. దాంతో ట్రాఫిక్ తగ్గింపు, సమయ ఆదా, పర్యావరణ ప్రయోజనాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications