Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో మెట్రో ఫేజ్ 2ఏ ట్రయల్ రన్లు..
బెంగళూరూ మెట్రో ఫేజ్ 2A ట్రయల్ రన్‌లు అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. అయితే పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో రైళ్లు రెండు కీలక స్టేషన్ల గుండా త్వరలో ప్రయాణించలేవని తెలుస్తోంది. జూన్‌లో గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ ప్రకటించినట్లుగా 19.75 కిలోమీటర్ల సిల్క్ బోర్డ్ జంక్షన్-KR పురం లైన్‌లో ట్రయల్ రన్‌లు అక్టోబర్‌లో రెండు దశల్లో ప్రారంభం అవుతాయి. మొదటి దశ ట్రయల్ రన్ కేఆర్ పురం నుంచి మారతహళి వరకు నిర్వహిస్తారు. రెండో దశ ట్రయల్ రన్ మారతహళ్లి నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వరకు నిర్వహించనున్నారు. అయితే మారతహళ్లి, సిల్క్ బోర్డ్ స్టేషన్ల మీదుగా ట్రయల్ రన్‌లు జరగడానికి మరింత సమయం పడుతుందని వారు తెలుస్తోంది.
మారతహళ్లి, సిల్క్ బోర్డ్ వద్ద తప్ప ఈ లైన్‌లో వయాడక్ట్ (ఎత్తైన మార్గం), ట్రాక్ పనులు చాలా వరకు పూర్తయ్యాయని ప్రాజెక్టకు సంబంధించి ఒకరు చెప్పారు. మారతహళ్లి వద్ద నాలుగు కాంపోజిట్ గిర్డర్లు అమర్చినట్లు వివరించారు. సిల్క్ బోర్డ్ వద్ద, స్టేషన్ అవతల ఉన్న 'డెడ్ ఎండ్' (లైన్ ముగింపు) వద్ద పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. కానీ కేఆర్ పురం-మారతహళ్లి, మారతహళ్లి-HSR లేఅవుట్ మార్గాల్లో అక్టోబర్‌లో ట్రయల్ రన్‌లు ప్రారంభిస్తామనే నమ్మకం తమకు ఉందని చెప్పారు. సిల్క్ బోర్డ్ స్టేషన్ దాటిన తర్వాత, రైళ్లు వెనక్కి తిరగడానికి (టర్న్‌బ్యాక్) వీలుగా మెట్రో లైన్ BDA ఫ్లైఓవర్ పైన 413.8 మీటర్ల మేర BTM లేఅవుట్ వైపు వెళ్తుందన్నారు.

ఇందుకు సంబంధించి ప్రస్తుతం పని కొనసాగుతుందని వివరించారు. ప్రయాణికులు ఒక లైన్ నుంచి మరొక లైన్‌కు మారడానికి వీలుగా, బ్లూ లైన్ స్టేషన్ ఇప్పటికే ఉన్న ఎల్లో లైన్ స్టేషన్‌తో ఎలివేటెడ్ ట్రావెలేటర్ లేదా నడక మార్గం (వాక్‌వే) ద్వారా అనుసంధానించనున్నారు. ఆగస్టు 10న సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్ పైన కాంపోజిట్ గిర్డర్లు అమ్చారు. వాక్‌వే స్థాయి గిర్డర్లు తర్వాత అమర్చనున్నారు. కేవలం నాలుగు స్పాన్‌ల (స్తంభాల మధ్య దూరం) పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఆగస్టు 14న బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ట్రావెలేటర్/వాక్‌వే కాంట్రాక్టును 'మిలన్ రోడ్ బిల్డ్‌టెక్ LLP'కి రూ. 55.48 కోట్లకు అప్పగించింది.
ఇది సంస్థ అంచనా వేసిన రూ. 58.99 కోట్ల కంటే దాదాపు 8 శాతం తక్కువ. దీనికి తొమ్మిది నెలల గడువు ఉన్నందున మే 2027 కంటే ముందు ఈ పని పూర్తయ్యే అవకాశం లేదు. మంత్రి కృష్ణ బైరే గౌడ ప్రకటించినట్లుగా మార్చి 2027 నాటికి ఫేజ్ 2A ప్రారంభమైనప్పటికీ, ట్రావెలేటర్ సిద్ధంగా ఉండదు కాబట్టి ప్రయాణికులు లైన్లు మారడానికి స్టేషన్ బయటకు రావాల్సి ఉంటుందని తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications