బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. Bengaluru Metro Rail Corporation Limited నిర్వహిస్తున్న నమ్మ మెట్రోలో మందు బాటిల్స్ తీసుకువెళ్లేందుకు ప్రయాణికులకు అనుమతి లభించనుంది. కాగా గతేదాడి నుంచి మెట్రో అనేక విమర్శలను ఎదుర్కుంటోంది. బెంగళూరు మెట్రో గత ఏడాది నుంచి ఛార్జీల పెంపుతో ప్రయాణికుల విమర్శలను ఎదుర్కది. టికెట్ ధరల పెంపుతో పాటు, మెట్రోలో అమల్లో ఉన్న కఠినమైన నియమాలు కూడా తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైళ్లలో రీల్స్ తీయడం, ఆహారం తీసుకోవడం, మద్యం సేవించడం లేదా మద్యం తీసుకెళ్లడం వంటి అంశాలపై ఇప్పటికే స్పష్టమైన ఆంక్షలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ నియమాల్లో ఒక దానిపై మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
నమ్మ మెట్రోలో ప్రయాణించే బెంగళూరు వాసులు సీలు చేసిన మద్యం బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదనపై Bengaluru Metro Rail Corporation Limited (BMRCL)లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు చర్చించామని.. తాజాగా జరిగిన సమావేశంలో కూడా దీనిని మరోసారి ప్రస్తావించామని BMRCL వర్గాలు వెల్లడించాయి. సూత్రప్రాయంగా ఆమోదం ఉన్నప్పటికీ, అమలుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశముందని అవి స్పష్టం చేశాయి.

ఈ ప్రతిపాదనకు ప్రధాన ప్రేరణగా Delhi Metro Rail Corporationలో అమలులో ఉన్న నిబంధనలే. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో, ముఖ్యంగా విమానాశ్రయ మార్గంలో, సీలు చేసిన మద్యం బాటిళ్లను ప్రయాణికులు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. అదే నమూనాను బెంగళూరులో కూడా అనుసరించాలని BMRCL భావిస్తోంది. మేము ఢిల్లీ మోడల్‌ను అనుసరిస్తాం. నమ్మ మెట్రో విమానాశ్రయానికి పూర్తిగా అనుసంధానమైన తర్వాత.. అంటే దాదాపు రెండేళ్లలో, ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఒక BMRCL అధికారి తెలిపారు.
ఈ మార్పు అమలయ్యేందుకు ప్రత్యేక లైసెన్స్ లేదా అదనపు అనుమతి అవసరం లేదని BMRCL అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆమోదం వచ్చిన తర్వాత, ఈ నిబంధనను మెట్రో అధికారిక నియమాలు, ఆదేశాలలో చేర్చుతారు. ప్రస్తుతం మాత్రం ఇది కేవలం చర్చల దశలోనే ఉంది. అధికారుల ప్రకారం.. ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రోలో మద్యం సేవించి ప్రయాణించడంపై పూర్తిగా నిషేధం లేదు. కానీ అది అనుమతించదగిన పరిమితుల్లో ఉండాలి. అయితే, ఆ అనుమతించదగిన పరిమితులు ఏంటన్నది స్పష్టంగా తెలియదు.
ఇప్పటికీ నమ్మ మెట్రో స్టేషన్లలో ప్రదర్శించబడిన బోర్డుల్లో నిషేధిత వస్తువుల జాబితా ఉంది. BMRCL ఎనిమిది వర్గాల్లో 58 రకాల వస్తువులను నిషేధితంగా గుర్తించింది. వాటిలో పదునైన వస్తువులు, ఆయుధాలు, పనిముట్లు, పేలుడు పదార్థాలు, మండే వస్తువులు, ప్రమాదకర రసాయనాలు తదితరాలు ఉన్నాయి. మద్యం ప్రస్తుతం మండే వస్తువుల విభాగంలో ఆల్కహాల్, స్పిరిట్‌లుగా జాబితా చేయబడి ఉంది.
మెట్రోలో మద్యం ఎందుకు నిషేధించబడిందన్న అంశంపై సంవత్సరాలుగా అనేక అభ్యర్థనలు, అభిప్రాయాలు వచ్చాయని అధికారులు తెలిపారు. రైళ్లలో తినడం, త్రాగడం అనుమతించకపోయినా, ఇతర లగేజీలా సీలు చేసిన బాటిళ్లను తీసుకెళ్లడంలో పెద్ద సమస్య ఉండకూడదని కొందరు సూచించారు. కొన్ని స్టేషన్లలో భద్రతా సిబ్బంది కూడా ఇప్పటికే అలా అనుమతించిన సందర్భాలు ఉన్నాయని ఒక అధికారి చెప్పారు. ఈ చర్చలను ధృవీకరిస్తూ, BMRCL డైరెక్టర్ (RES & O&M) సుమిత్ భట్నాగర్ మెట్రో రైళ్లలో మద్యం బాటిళ్లను అనుమతించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

Bengaluru: ఆపదలో పుట్టిన ఆలోచన! గ్యాస్ సమస్యకి సామాన్యుడి అద్భుత పరిష్కారం..!

బెంగళూరు నుండి 2 వేల స్సెషల్ బస్సులు.. ఉగాది నాడు ప్రయాణికులకు KSRTC గుడ్ న్యూస్..

Bengaluru: గ్యాస్ కొరత సాకుతో అదనపు బాదుడు.. వైరల్ అవుతున్న బెంగళూరు కేఫ్ బిల్లు!

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications