ఐటీ నగరం బెంగళూరు (Bengaluru)లో నిత్యం లక్షలాది మంది ప్రయాణించే 'నమ్మ మెట్రో' ఛార్జీలు పెరగనున్నాయి. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఫిబ్రవరి 9, 2026 నుండి మెట్రో ధరలను 5 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఒక్కసారిగా 51 శాతం పెంచినట్లు కాకుండా.. ఇకపై ఏటా కొద్దికొద్దిగా ధరలు సవరించే విధానాన్ని (Annual Fare Revision) అధికారులు ప్రవేశపెట్టారు. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పెంపు ఎందుకు? ఎంత పెరిగింది?
మెట్రో నిర్వహణ ఖర్చులు, పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతాల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. 2024-25 లెక్కల ప్రకారం నిర్వహణ ఖర్చులు 10 శాతం పెరిగినప్పటికీ, ప్రయాణికులపై భారం పడకుండా ఉండాలని ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) గరిష్ట పరిమితిని 5 శాతానికి పరిమితం చేసింది. దీనివల్ల ప్రయాణికులపై కనిష్టంగా రూ. 1 నుండి గరిష్టంగా రూ. 5 వరకు భారం పడనుంది. పెరగనున్న కొత్త ఛార్జీలు ఎలా ఉంటాయంటే...
కొత్త ఛార్జీల వివరాలు ఇవే..
ప్రస్తుతం బెంగళూరులో 96.10 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్ ఉంది. తాజా సవరణ ప్రకారం పది జోన్లలో ధరలు ఇలా ఉండబోతున్నాయి..
- తక్కువ దూరం (F1 Zone): గతంలో రూ. 10 ఉండగా.. ఇప్పుడు రూ. 11 కు పెరిగింది.
- మధ్యస్థ దూరం (F6 Zone - 10 నుండి 15 కి.మీ): గతంలో రూ. 60 ఉండగా, అది రూ. 63 అవుతుంది.
- ఎక్కువ దూరం (F10 Zone): గరిష్టంగా రూ. 90 నుండి రూ. 95 కి పెరిగింది.
ఇకపోతే మెట్రో టికెట్ ధరలతో పాటు టూరిస్ట్ కార్డ్స్, గ్రూప్ టిక్కెట్ల ధరలు కూడా 5 శాతం పెరిగాయి. ఒక రోజు పాస్ ధర స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు రూ. 263 గా, మొబైల్ క్యూఆర్ కోడ్ వాడేవారికి రూ. 313 గా నిర్ణయించారు. ఐదు రోజుల పాస్ ధర కూడా వరుసగా రూ. 893 , రూ. 943 కు పెరిగింది.
డిస్కౌంట్లు యథాతథం!
ధరలు పెరిగినప్పటికీ, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు పాత రాయితీలను మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు.
- పీక్ అవర్స్ (రద్దీ సమయం): స్మార్ట్ కార్డ్ , NCMC కార్డులు వాడేవారికి 5% డిస్కౌంట్ ఉంటుంది.
- నాన్-పీక్ అవర్స్ & సెలవు రోజులు: ఆదివారాలు , జాతీయ సెలవు దినాల్లో కార్డులు వాడేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది.
మొత్తంగా మెట్రో సేవల్లో నాణ్యత, భద్రత, సమయపాలనను కాపాడటంతో పాటు కొత్త మార్గాల విస్తరణ కోసం ఈ ధరల పెంపు తప్పనిసరని బెంగళూరు (Bengaluru) మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications