బెంగళూరు (Bengaluru) వంటి మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడు సామాన్యుడి నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వరకు అందరూ మెట్రో రైలు ఎక్కేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మెట్రో ప్రభావం కేవలం ప్రయాణాల మీద మాత్రమే కాదు. బెంగళూరు రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా భారీగా పడింది. తాజా గణాంకాల ప్రకారం మెట్రో స్టేషన్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల డిమాండ్ ఏకంగా 19% పెరిగింది.

నో బ్రోకర్ (NoBroker) సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025 లో బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ ను మెట్రో కనెక్టివిటీ శాసిస్తోంది. మెట్రో స్టేషన్లకు సమీపంలో ఉన్న కాలనీల్లో ఇళ్ల కొనుగోలుదారుల ఆసక్తి పెరగడమే కాకుండా.. అద్దెలు కూడా సాధారణ ప్రాంతాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. మెట్రో సౌకర్యం ఉన్న చోట నివసించేందుకు ప్రజలు 15-20% అదనంగా అద్దె చెల్లించడానికి కూడా వెనకాడటం లేదు.
ఏయే ప్రాంతాల్లో ఎంత డిమాండ్?
ముఖ్యంగా ఐటీ కారిడార్ ను కలిపే పర్పుల్ లైన్ (Purple Line) మీద డిమాండ్ విపరీతంగా ఉంది.
- వైట్‌ఫీల్డ్ (Whitefield): ఇక్కడ డిమాండ్ 14% పెరిగింది.
- కె.ఆర్. పురం (K.R. Puram): ఈ ప్రాంతం ఏకంగా 18% వృద్ధిని నమోదు చేసింది.
- విజయనగర్: ఇక్కడ 9% డిమాండ్ పెరిగింది.
ఇక నార్త్-సౌత్ కలిపే గ్రీన్ లైన్ (Green Line) విషయానికి వస్తే.. జయనగర్‌లో 13%, రాజాజీనగర్‌లో 9% డిమాండ్ పెరిగినట్లు డేటా చెబుతోంది. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ వంటి ఐటీ హబ్‌లు ఉన్న ఎల్లో లైన్ మీద కూడా 12% వరకు డిమాండ్ కనిపిస్తోంది.
ఆకాశాన్ని అంటుతున్న అద్దెలు!
మెట్రో వల్ల ప్రయాణ సమయం 30-40% తగ్గడంతో.. ఆఫీసులకు వెళ్లే టెక్కీలు మెట్రో స్టేషన్ పక్కనే ఇళ్లు వెతుకుతున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో అద్దెలు చుక్కలు చూపిస్తున్నాయి..
- మల్లేశ్వరం: ఇక్కడ రెంట్స్ 19% పెరిగాయి.
- జయనగర్: 18% అద్దెలు పెరిగి యజమానులకు లాభాలు పంచుతున్నాయి.
- ఇందిరానగర్: ఇక్కడ 13% వృద్ధి నమోదైంది.
కేవలం ఇవే కాకుండా రాబోయే మెట్రో ప్రాజెక్టుల ప్రభావం కూడా ముందుగానే కనిపిస్తోంది. ఉదాహరణకు, మెట్రో ఇంకా రాని బెల్లందూరు (Bellandur) వంటి ప్రాంతాల్లో కూడా ఇళ్ల ధరలు 18% పెరగడం విశేషం. అంటే భవిష్యత్తులో మెట్రో వస్తుందన్న ఆశతో ఇప్పుడే పెట్టుబడులు పెరుగుతున్నాయి.
మెట్రోతో మారుతున్న లైఫ్ స్టైల్
మెట్రో కేవలం దూరాన్ని తగ్గించడమే కాదు, ప్రజల నివాస ఎంపికలను కూడా మారుస్తోంది. గతంలో వైట్‌ఫీల్డ్‌లో పనిచేసే వారు అక్కడే ఖరీదైన ఇళ్లలో ఉండేవారు. కానీ ఇప్పుడు మెట్రో సౌకర్యం ఉండటంతో.. సౌత్ బెంగళూరులో తక్కువ అద్దెకు దొరికే ఇళ్లలో ఉంటూ హాయిగా మెట్రోలో ఆఫీస్ చేరుకుంటున్నారు.
చివరిగా చెప్పాలంటే బెంగళూరు (Bengaluru) లో ఇప్పుడు 'మెట్రో' అనేది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాదు.. అదొక రియల్ ఎస్టేట్ గోల్డ్ మైన్. రాబోయే రోజుల్లో సర్జాపూర్ నుండి హెబ్బల్ వరకు వచ్చే కొత్త మెట్రో లైన్ల వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ మరిన్ని మలుపులు తిరగడం ఖాయం.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో 9-5 షెడ్యూల్ అంటే ఇదే.. సోషల్ మీడియాలో టెక్కీ షేర్ చేసిన రియాలిటీ!

Bengaluru: బెంగళూరులో గ్యాస్ కష్టాలు.. హోటళ్లు మూతపడే ప్రమాదం?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: బెంగళూరులో సామాన్యుడు బ్రతకగలడా? వైరల్ అవుతున్న టెక్కీ నెలవారీ ఖర్చుల చిట్టా!

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

వైజాగ్ రియల్ ఎస్టేట్.. ఈ నాలుగు జోన్లలోని ఫ్లాట్ల కోసం ఎగబడుతున్న కొనుగోలుదారులు..కారణం ఏంటంటే..

ఫ్రిజ్‌లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..



Click it and Unblock the Notifications