Bengaluru Metro News : బెంగళూరు మెట్రోకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవినాష్ చంచల్ అనే వ్యక్తి ఎక్స్ లో షేర్ చేసిన ఈ న్యూస్ నెటిజన్ల నుంచి అనేక అభిప్రాయాలను అందుకుంది. ఆ వ్యక్తి పోస్ట్ చేసిన వివరాలను చూస్తే.. బెంగళూరు మెట్రోలో అతను ఒక చిన్న సూట్‌కేస్‌తో ప్రయాణిస్తున్నాడు. సాధారణంగా మెట్రోలో ఈ తరహా బ్యాగ్ లతో ప్రయాణించడం పెద్ద విషయం కాదు. దానికి ఛార్జీ కూడా ఉండదు.
అయితే బెంగళూరు మెట్రోలో బ్యాగుతో ప్రయాణించిన ఈ యువకుడిని నమ్మ మెట్రో సిబ్బంది నిలిపివేశారు. లగేజీ పరిమితిని మించి ఉంది, అదనపు రుసుము రూ. 30 చెల్లించాలని ఆ యువకుడికి చెప్పారు.అయితే ఆ యువకుడు ఎంత వాదులాడినా ప్రయోజనం లేదనుకుని ఛార్జీ చెల్లించి మెట్రో ఎక్కాడు. వెంటనే తన అనుభవాన్ని X ( ట్విటర్)లో పోస్ట్ చేశాడు. ఈ చిన్న బ్యాగ్‌కి రూ.30 చెల్లించాలా.. బెంగళూరు మెట్రో ఒక్కటే దేశంలోనే ఖరీదైన మెట్రో. దీనిపై అదనపు ఛార్జ్ వసూలు చేయటం ప్రజలను మెట్రో దూరం పెట్టే మరో ఉదాహరణ అంటూ రాసుకొచ్చారు. నమ్మ మెట్రో కూడా చాలా ఖరీదైనదిగా మారుతోందని తెలిపారు.

ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. కొద్ది గంటల్లోనే అనేక మంది నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను పంచుకుంటూ చర్చను కొనసాగించారు. చాలామంది అతనికి మద్దతుగా మాట్లాడగా.. మరికొందరు మాత్రం ఛార్జీ చెల్లించాలని చెప్పారు. కొందరు ఎందుకు చెల్లించాలి? ఎక్కడైనా ప్రత్యేక లగేజి కౌంటర్ లేదా నిల్వ స్థలం ఉందా? అలాంటప్పుడు ఈ రుసుము సరియైనదేనా?" అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. మరొక నెటిజన్ ఇది అత్యంత ఖరీదైన మెట్రో - దానికి తగ్గట్టే 'అదనపు రుసుంలు' వసూలు చేస్తున్నారంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
ఇంకొక నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. బ్యాగ్ స్కానర్‌లో సరిపోతే ఎవరికీ ఎలాంటి అయ్యో అనిపించదు. అయితే అది పెద్దదైతే అక్కడ నిలబడి జనం కోసం స్కానర్‌ను బంధిస్తే అది కూడా ఇతర ప్రయాణికులకు అన్యాయం కదా అని ప్రశ్నించారు. అతను మామూలుగా సూట్‌కేస్, బ్యాక్‌ప్యాక్ రెండింటినీ తీసుకెళ్లి, ఒక్కసారి కూడా ఛార్జ్ కట్టలేదు అని కూడా తెలిపాడు.
నగరంలో బస్సులు జాం అవుతాయ్, రోడ్ల మీద ట్రాఫిక్ దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో మెట్రోను వినియోగించుకోవడం తప్ప దారి లేదు. అందుకే అధికారులు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారని తెలుస్తోంది..ప్రజలు తప్పించుకోలేరని వారికి తెలుసు అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు.
ఒక మహిళా నెటిజన్ దీనిపై ఇంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లగేజీపై ఛార్జ్ విధించడం పెద్ద సమస్యేమి కాదు... కానీ అదే సమయంలో, మీరు మద్యం బాటిల్స్ లేదా డ్రిల్ మెషిన్ తీసుకెళ్లడం ట్రై చేస్తే, లోపలికి కూడా అనుమతించరు. పూర్తిగా బ్యాగ్ సమస్య కాదని ఈ నిబంధనలు ఎవరికై ఉపయోగపడతాయని రాసుకొచ్చింది. పబ్లిక్ ట్రాన్సిట్‌కి ప్రజలు తలదించుకుని అనుసరించేలా చేయాలా? లేక కొత్త కొత్త రుసుములతో వారికి ఇబ్బంది పెట్టాలా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు.
ఏదేమైనా ఈ డిబేట్ మౌలిక సదుపాయాల - వ్యయాలా అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చనయితే లేపింది. నమ్మ మెట్రో ప్రయాణంలో ఓ చిన్న బాగ్ నగరంలోని జనాల ఆవేదనను ప్రతిబింబించే ఓ వేదికలా మారింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications