బెంగళూరులో మౌలిక సదుపాయాలపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. రోడ్లు, నీటి సరఫరా, చెత్త నిర్వహణ, ట్రాఫిక్ వంటి సమస్యలు ఇప్పటికే తీవ్రంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జనాభా అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (DES) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం..బెంగళూరులో 2031 నాటికి జనాభా 1.47 కోట్లకు చేరవచ్చని తెలిపింది. ప్రస్తుతం 2021లో నగర జనాభా 1.22 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే, కేవలం పదేళ్లలోనే దాదాపు 20 శాతం పెరుగుదల జరగనుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
2025 నుండి 2026 మధ్య కాలంలో మాత్రమే నగర జనాభా వృద్ధి రేటు 1.93 శాతంగా ఉండొచ్చని DES అంచనా వేసింది, ఇది కర్ణాటకలో అత్యధిక వృద్ధి రేటుగా చెప్పుకోవచ్చు. ఈ పెరుగుదల ప్రధానంగా వలసలు (migration) కారణంగా జరుగుతోందని నిపుణులు అంటున్నారు. కేవలం ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, కర్ణాటకలోని ఇతర జిల్లాల నుంచీ Bengaluru కి భారీగా ప్రజలు వలస వస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు, ఆర్థిక అవకాశాల వైవిధ్యంగా చెప్పుకోవచ్చు.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ జాయింట్ డైరెక్టర్ కె. నరసింహ ఫాణి మాట్లాడుతూ.. Bengaluruలో వృద్ధి ఎక్కువగా జీవనోపాధి అవకాశాల ద్వారానే నడుస్తోంది. రాష్ట్రం వెలుపల నుండి మాత్రమే కాకుండా, కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల నుంచీ పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయని చెప్పారు. ఈ పెరుగుదల కర్ణాటక మొత్తం జనాభాలో బెంగళూరుకి ఉన్న వాటాను కూడా మార్చేస్తోంది. 2021లో రాష్ట్ర జనాభాలో బెంగళూరు వాటా 18.2 శాతంగా ఉండగా.. 2031 నాటికి ఇది 20.7 శాతానికి పెరుగుతుందని అంచనా. అంటే, కర్ణాటకలో ప్రతి ఐదుగురిలో ఒకరు బెంగళూరులో నివసించే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.
ఇక రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్న పట్టణ ప్రాంతాల పరిస్థితి కూడా అంతేనని నివేదిక తెలిపింది. కర్ణాటకలో పట్టణ జనాభా మొత్తం వాటా 2021లో 43.9 శాతం ఉండగా, 2031 నాటికి అది 47.8 శాతానికి పెరుగుతుందని DES చెబుతోంది. ఇది కర్ణాటకలో పట్టణీకరణ వేగం విపరీతంగా పెరుగుతోందని సూచిస్తుంది. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి నగర మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ క్షోభ, నీటి కొరత, చెత్త నిర్వహణలో అవ్యవస్థ వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నగర సరిహద్దులను మరింత విస్తరించడం ప్రమాదకరమైన చర్య అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జైన్ విశ్వవిద్యాలయ సలహాదారు, ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ (ISEC) మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. మాధేశ్వరన్ మాట్లాడుతూ.. బెంగళూరు పట్టణ ప్రణాళికా చట్రం చాలా పాతది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న పెరి-అర్బన్ ప్రాంతాలు, డివిజన్లు ప్రస్తుత ప్రణాళికల్లో ప్రతిబింబించవు. డివిజన్ స్థాయి సున్నితమైన డేటా లేకుండా ప్రణాళిక అంటే పై నుంచి కిందికి వచ్చే ఒక యాంత్రిక వ్యాయామం మాత్రమే అవుతుందని అన్నారు.
ఇప్పుడు నగర అంచుల్లో కలిసిపోయిన పెరి-అర్బన్ ప్రాంతాలు పాలన పరంగా అంధకారంలో ఉన్నట్లే ఉన్నాయి. వీటిలో ఆరోగ్యం, విద్య, పౌర సదుపాయాల విస్తరణ కష్టమవుతోంది. ప్రతి 50 వేల మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటి సదుపాయాలు ఇవ్వాలంటే, మైక్రోస్థాయి డేటా అవసరమని తెలిపారు. ఏదేమైనా బెంగళూరులో 2031 నాటికి 1.5 కోట్ల జనాభా చేరుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. అయితే ఈ వృద్ధిని సక్రమంగా నిర్వహించకపోతే, దేశంలోని సాంకేతిక రాజధాని భవిష్యత్తులో మౌలిక సదుపాయాలు కుప్పకూలే దిశగా నడిచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications