భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం అంటే కేవలం ఐటీ ఉద్యోగాలు, ట్రాఫిక్ మాత్రమే కాదు.. విపరీతమైన జీవన వ్యయానికి కూడా పెట్టింది పేరు. తాజాగా ఒక యువకుడు బెంగళూరుకు మారిన మొదటి వారంలోనే తనకు అయిన ఖర్చుల వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది పెద్ద చర్చకు దారితీసింది. కేవలం ఏడు రోజుల్లోనే అతను సుమారు 30 వేల రూపాయలకు పైగా ఖర్చు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

కేవలం వారానికే రూ. 30,000 ఖర్చు!
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆ యువకుడు తన 'బెంగళూరు డైరీ' ని పంచుకున్నాడు. నగరంలో అడుగుపెట్టిన మొదటి వారంలోనే ఇంటి అద్దె కోసం రూ. 18,000, ఫుడ్ కోసం రూ. 12,000 వెచ్చించినట్లు తెలిపాడు. "సిటీ లైఫ్ అస్సలు చౌక కాదు.. పైగా నాకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసే అలవాటు కూడా ఉంది" అంటూ అతను నిజాయితీగా రాసుకొచ్చాడు.
ఇందిరానగర్ నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ వరకు..
సరైన ఇల్లు వెతుక్కోవడానికి అతను ఇందిరానగర్, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ , ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రముఖ ఐటీ కారిడార్లను చుట్టేశాడు. చివరికి హెచ్‌ఎస్‌ఆర్ (HSR Layout) ఏరియాలో ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ను ఖరారు చేసుకున్నాడు. అక్కడ నడిచే దూరంలోనే అన్నీ అందుబాటులో ఉండటం తన నిర్ణయానికి కారణమని చెప్పాడు.
నెటిజన్ల ఆశ్చర్యం.. 18 వేలకే ఇల్లా?
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి నగరంలో హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ లో ఫర్నిష్డ్ ఫ్లాట్ రూ. 18,000 కే దొరకడం అంటే అది అద్భుతమేనని చాలామంది కామెంట్ చేస్తున్నారు. "బెల్లందూర్ వంటి ఏరియాల్లో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నీకు దొరికిన డీల్ నిజంగా అదృష్టమే" అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. మరికొందరు మాత్రం.. "వారానికి 12 వేలు తిండికి ఖర్చు చేయడం ఏంటి? ఇది ఏమాత్రం పొదుపు కాదు" అంటూ విమర్శిస్తున్నారు.
ఖర్చు ఎక్కువైనా.. అవకాశాల గని
ఖర్చుల విషయం పక్కన పెడితే.. బెంగళూరు నగరం పని చేయడానికి చాలా మంచి ప్రదేశమని ఆ యువకుడు కొనియాడాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని, అసలు ఇలాంటి వాతావరణాన్ని తను ఊహించలేదని పాజిటివ్ గా ముగించాడు. పెరుగుతున్న అద్దెలు, ఖరీదైన జీవనశైలి ఉన్నప్పటికీ.. యువతకు కెరీర్ పరంగా బెంగళూరు ఇచ్చే కిక్కే వేరు అని ఈ పోస్ట్ ద్వారా మరోసారి స్పష్టమైంది
ఏది ఏమైనా కొత్తగా నగరానికి వచ్చే వారు తమ బడ్జెట్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ముఖ్యంగా ఫుడ్ డెలివరీ యాప్స్, అనవసరపు తిరుగుళ్లపై నియంత్రణ ఉంటే తప్ప నగరం ఇచ్చే జీతాలు సరిపోవని ఈ యువకుడి అనుభవం మనకు హెచ్చరికగా నిలుస్తోంది.
More From GoodReturns

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications