Bengaluru: తల్లిదండ్రులు తిట్టారు.. స్నేహితులు నవ్వారు! నేడు అదే ఫలూడాతో కోట్లు సంపాదిస్తున్నాడు!

సాధారణంగా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ హోదాలో ఉంటే ఎవరైనా ఏం కోరుకుంటారు? మంచి జీతం, ఫైవ్ డే వర్క్, లైఫ్ సెటిల్డ్ అనుకుంటారు. కానీ బెంగళూరు (Bengaluru) కు చెందిన ప్రదీప్ కన్నన్ మాత్రం అలా అనుకోలేదు. డెలాయిట్ (Deloitte) వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలేసి, గరిటె తిప్పాలని నిర్ణయించుకున్నాడు. నేడు ఆయన స్థాపించిన 'ది ఫలూడా షాప్' (The Falooda Shop) విలువ అక్షరాలా రూ. 9 కోట్లు!

Bengaluru Man Quits Deloitte Job To Build Rs 9 Crore Falooda Empire Check Success Story And Details

ప్రయాణం మొదలైంది ఇలా..

2019లో తన కలల కోసం స్థిరమైన కెరీర్‌ను వదులుకున్న ప్రదీప్, తమిళనాడులోని తన సొంత ఊరు కరూర్ వెళ్ళిపోయాడు. అక్కడ చిన్నగా మొదలైన ఆయన ప్రయాణం, నేడు భారత్ , దుబాయ్‌లలో కలిపి 18 కి పైగా అవుట్‌లెట్లకు విస్తరించింది. మొదట్లో ఈ నిర్ణయాన్ని అందరూ "తెగింపు" అని కాకుండా "తెలివితక్కువతనం" అని కొట్టిపారేశారు. కానీ ప్రదీప్ తన విజన్ మీద నమ్మకంతో ముందుకు సాగాడు.

పెట్టుబడి ఎంత? ఖర్చుల లెక్కలివే!

ఇటీవల ప్రదీప్ తన మొదటి అవుట్‌లెట్ ప్రారంభించడానికి అయిన ఖర్చుల వివరాలను పంచుకున్నాడు. మొత్తం రూ. 22 లక్షల పెట్టుబడిలో..

  • అద్దె డిపాజిట్: రూ. 2.4 లక్షలు
  • లైసెన్సులు: రూ. 60,000
  • సామాగ్రి (Equipment): రూ. 2 లక్షలు (కొత్తవి , సెకండ్ హ్యాండ్ కలిపి)
  • ఇంటీరియర్స్ & ఫర్నిచర్: రూ. 10 లక్షలు (ఇదే అతిపెద్ద ఖర్చు)
  • స్టాఫ్ జీతాలు: రూ. 80,000 (నలుగురు వ్యక్తులకు)
  • బ్రాండింగ్: రూ. 1 లక్ష

"మీకు ఖరీదైన ఇంటీరియర్స్ అవసరం లేదు, మీకు కావాల్సింది పదే పదే వచ్చే కస్టమర్లు మాత్రమే" అని ప్రదీప్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

నెటిజన్ల రియాక్షన్: 'తొందరపడి ఉద్యోగాలు వదలకండి!'

ప్రదీప్ సక్సెస్ స్టోరీ వైరల్ అవ్వగానే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు "నిజమైన ధైర్యవంతుడు..execution అంటే ఇదే" అని ప్రశంసించగా, మరికొందరు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. "వార్తల్లో గెలిచిన వారి కథలే వస్తాయి, ఓడిపోయిన వేలమంది గురించి ఎవరూ చెప్పరు. కాబట్టి ఎమోషనల్ అయ్యి ఉద్యోగాలు వదిలేయకండి.. సరైన రీసెర్చ్, బ్యాకప్ ప్లాన్ ఉండాలి" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

మరికొందరు డెలాయిట్‌తో పోలుస్తూ, "డెలాయిట్‌లో ఉంటే ఈ ఐదేళ్లలో ఇంత సంపాదించలేరు.. సరైన మార్గం ఎంచుకున్నాడు" అని మద్దతు తెలిపారు. ఏది ఏమైనా, బెంగళూరు (Bengaluru) లో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇలాంటి వినూత్న వ్యాపారంతో గ్లోబల్ బ్రాండ్‌గా ఎదగడం నిజంగా విశేషమే.

రియాలిటీ చెక్

ప్రదీప్ కన్నన్ కథ ఒక పక్క స్ఫూర్తిని ఇస్తున్నా, మరోపక్క వ్యాపారంలోని రిస్కులను గుర్తుచేస్తోంది. సక్సెస్ అనేది కేవలం కష్టపడితేనే రాదు, దాని వెనుక అదృష్టం, మార్కెట్ టైమింగ్ , సరైన ప్రిపరేషన్ ఉంటాయని ఈ స్టోరీ మనకు నేర్పుతుంది. మీరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే, నాణేనికి ఉన్న రెండు వైపులా ఆలోచించడం ముఖ్యం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+