సాధారణంగా ఎవరైనా మంచి చదువు చదువుకుని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధిస్తే.. లైఫ్ సెటిల్ అయిపోయింది అని భావిస్తారు. నెలకు లక్షల్లో జీతం, ఏసీ రూముల్లో పని.. ఇది చాలా మంది కల. కానీ, బెంగళూరు (Bengaluru) కు చెందిన రాకేష్ అనే వ్యక్తి కథ దీనికి పూర్తి భిన్నం. అందరూ కోరుకునే ఆ విలాసవంతమైన కార్పొరేట్ జీవితాన్ని వదిలేసి, ఆయన ఇప్పుడు రోడ్ల మీద ఆటో నడుపుకుంటూ తన మనశ్శాంతిని వెతుక్కుంటున్నాడు. ఇంతకీ అసలు ఏమైందంటే..

కార్పొరేట్ 'బర్నౌట్' నుంచి బయటకు..
రాకేష్ కూడా ఒకప్పుడు అందరిలాగే కార్పొరేట్ ఆఫీసుల్లో బిజీగా గడిపేవారు. అయితే పని ఒత్తిడి, టార్గెట్లు, మెంటల్ స్ట్రెస్ ఆయనను లోలోపల కుంగదీశాయి. ఒక కంపెనీ మారితే పరిస్థితి మారుతుందేమో అనుకున్నారు. కానీ, ఎక్కడ చూసినా అదే కథ. దీంతో విసిగిపోయిన ఆయన.. 2022 లో తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి శాశ్వతంగా స్వస్తి పలికారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా చేతిలో డబ్బులు నిండుకున్నాక అసలు కష్టాలు మొదలయ్యాయి.
కష్టకాలంలో తోడుగా నిలిచిన కుటుంబం
ఉద్యోగం వదిలేయడం సులభమే.. కానీ, మళ్ళీ కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టడం చాలా కష్టమని రాకేష్ కు అర్థమైంది. తన చిన్న కూతురు, వృద్ధురాలైన తల్లి బాధ్యతలు ఆయనపై ఉన్నాయి. ఉద్యోగం లేక, ఆదా చేసిన డబ్బులన్నీ అయిపోయి తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు బంధువుల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి. కానీ, తన తల్లి, కూతురు ఇచ్చిన ధైర్యంతో ఆయన మళ్ళీ నిలబడాలని నిర్ణయించుకున్నారు. తిరిగి కార్పొరేట్ నరకంలోకి మాత్రం వెళ్లకూడదని గట్టిగా అనుకున్నారు.
ఆటో డ్రైవర్ గా కొత్త ప్రయాణం
ఉపాధి కోసం రాకేష్ మొదట రాపిడో వంటి చిన్న చిన్న పనులు చేశారు. అలా ఏడాది పాటు కష్టపడి కొంత డబ్బు పోగు చేసి, ఈఎంఐ (EMI) మీద ఒక ఆటోను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆయన రోజూ బెంగళూరు (Bengaluru) వీధుల్లో ఆటో నడుపుతూ రోజుకు రూ. 600 నుండి రూ. 800 వరకు సంపాదిస్తున్నారు. పాత ఉద్యోగంతో పోలిస్తే ఆదాయం చాలా తక్కువే అయినా ఇప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు, మనసులో ప్రశాంతత ఉన్నాయని రాకేష్ చెప్తున్నాడు.
ప్రయాణికులతో సరదా ముచ్చట్లు
రాకేష్ తన ఆటోలో ఎక్కే ప్రయాణికులతో చాలా సరదాగా గడుపుతుంటారు. తన రోజువారీ అనుభవాలను సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకుంటూ అందరినీ అలరిస్తున్నారు. జీవితం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. స్వేచ్ఛగా, సంతోషంగా ఉండటమే అని ఆయన నిరూపిస్తున్నారు. లక్షల జీతం ఇచ్చే ఒత్తిడి కంటే, వందల్లో వచ్చే ఈ ప్రశాంతతే మిన్న అని రాకేష్ చెబుతున్న మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Trending: యూపీలో వింత ఘటన.. సామాన్యురాలి ఖాతాలోకి రూ. 10 కోట్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications