Swiggy Fraud: స్విగ్గీ ఖాతాతో మోసం.. రూ.38,000 మాయం.. కొత్త స్కామ్ జాగ్రత్త..
Bengaluru Fraud: మార్కెట్లోకి రోజుకో కొత్త రకం సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దొంగలు మనం ఎలాంటి ఓటీపీలు చెప్పకుండానే డబ్బును కాజేసే కొత్త మార్గాన్ని కనిపెట్టారు. దీంతో మన ప్రమేయం లేకుండానే వేలల్లో సొమ్ము మాయమైపోతోంది.
తాజా బెంగళూరుకు చెందిన చెన్నకేశవ అనే వ్యక్తి రూ.38,000 డబ్బును పోగొట్టుకున్నాడు. అతనికి చెందిన లేజీపే లోన్ ఖాతా నుంచి నిందితులు సొమ్ము తస్కరించారు. దీనికోసం వారు చేసిన ప్రయత్నాలతో ఏకంగా బాధితుడి మెుబైల్‌కి 10,000 ఓటీపీలు వచ్చాయి. దీనికి తోడు అనేక సార్లు అతనికి ఫోన్లు కూడా వచ్చాయి. అసలు ఈ మోసం చెన్నకేశవ స్విగ్గీ ఖాతా నుంచి జరిగింది. అతనికి రూ.5,345 విలువైన ఫుడ్ ఆర్డర్ చేసినట్లు వాయిస్ కాల్ వచ్చింది. నిర్ధారించేందుకు రెండు నొక్కాలని, లేకుంటే ఒకటి నొక్కమని అందులో వచ్చింది. దీంతో అతను ఒకటి నొక్కాడు.

ఈ క్రమంలో అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఓటీపీని అందించాలని వాయిస్ మెసేల్ ద్వారా అడగటంతో ఆ వివరాలు టైప్ చేశాడు. అయితే మళ్లీ ఓటీపీలు రావటంతో తన ఖాతాలో ఎవరో లాగిన్ అయ్యారేమోనని అనుకున్నాడు. దీంతో వరుస కాల్స్ రావటంతో స్విగ్గీ ఖాతా నుంచి లాగౌట్ అయ్యాడు. లాగౌట్ అవటంతో దొంగలు వరుసగా సాయంత్రం అయినప్పటికీ కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సైబర్ దొంగలు అతని ఖాతా నుంచి రూ.38,720 ఖర్చు చేశారని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.
దీంతో తనకు తెలియకుండా ఏదో మోసం జరుగుతోందని గ్రహించిన కేశవ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ సమయంలో స్విగ్గీ ఖాతాలోకి ఒకసారి లాగిన్ కావాలని వారు సూచించగా అప్పటికే అక్కడ పూర్తి వివరాలను సైబర్ కేటుగాళ్లు డిలీట్ చేసేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి స్విగ్గీకి దీనిపై పూర్తి వివరాలు అందించాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో లేజీపే సైతం సదరు వ్యక్తి క్రెడిట్ ఖాతాను దుర్వినియోగం కాకుండా సీజ్ చేసింది. సో ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమన్నా చాలా జాగ్రత్తగా ఉండండి.


Click it and Unblock the Notifications