సినిమాకి వెళ్ళినపుడు ముందుగా యాడ్స్ లేదా ట్రైలర్స్ వేస్తుంటారు, కాసేపటికి సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ సినిమాకి ముందు అరగంట సేపు యాడ్స్ వేస్తే ఎలా ఉంటుంది... అలాంటిదే జరిగింది. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల ఓ వ్యక్తి సినిమా షోకి ముందు ఎక్కువగా అడ్వాటైజ్మెంట్లతో తన సమయాన్ని వృధా చేశాయని, దీని వల్ల తనకు మానసిక వేదన కలిగించాయని PVR సినిమాస్, INOX అండ్ BookMyShowలపై దావా వేయడంతో అతనికి నష్ట పరిహారంగా రూ.28,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం, అభిషేక్ అనే వ్యక్తి 2023లో సామ్ బహదూర్ కోసం సాయంత్రం 4.05 గంటల షోకు మూడు టిక్కెట్లు బుక్ చేసుకున్నానని, సినిమా సాయంత్రం 6.30 గంటలకు ముగిసిపోతుందని తరువాత తాను తిరిగి పనికి టైంకి వెళ్లొచ్చని అనుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా 25 నిమిషాల పాటు ప్రకటనలు ఇంకా ట్రైలర్ల తర్వాత సినిమా సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైందని, ప్రకటనలు, ట్రైలర్ల వల్లనే సినిమా ఆలస్యంగా ప్రారంభం అయిందని పేర్కొన్నాడు.

దింతో అభిషేక్ వెళ్లాలనుకున్న అపాయింట్‌మెంట్‌లకు టైంకి హాజరు కాలేకపోయానని, దీనివల్ల తిరిగి పొందలేని నష్టాలు సంభవించాయని పేర్కొన్నాడు. తన సమయం వృధా అయిందని ఇంకా సినిమా షో సమయాలను తప్పుగా చూపించడం ఇది అన్యాయమైన బిజినెస్ పద్ధతి అని వాదించాడు.
అభిషేక్ ఫిర్యాదుతో కన్స్యూమర్ కోర్టు ఏకీభవిస్తూ, "సమయాన్ని డబ్బుగా పరిగణిస్తారు" అని తీర్పు చెప్పింది. అలాగే జరిమానాగా, అభిషేక్‌కు మానసిక క్షోభకు రూ. 20,000, చట్టపరమైన ఖర్చుల కోసం రూ. 8,000 చెల్లించాలని కోర్టు PVR అండ్ INOXలను ఆదేశించింది. అదనంగా, PVR ఇంకా INOX రెండింటికీ రూ. 1 లక్ష జరిమానా విధించింది. అయితే, BookMyShow దీనికి బాధ్యత వహించలేదు, ఎందుకంటే BookMyShow టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే. ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పులో "ఇతరుల సమయం ఇంకా డబ్బు నుండి ప్రయోజనం పొందే హక్కు ఎవరికీ లేదు" అని కోర్టు నొక్కి చెప్పింది, ముఖ్యంగా బిజీ షెడ్యూల్ ఉన్న వారికి థియేటర్‌లో 25-30 నిమిషాలు ఖాళీగా చేపించడం చాలా విలువైన సమయం వృధా చేయడం అని పేర్కొంది.
PVR ఇంకా INOX సంస్థలు చట్టబద్ధంగా కొన్ని పబ్లిక్ సర్వీస్ ప్రకటనలను (PSAలు) అవగాహన పెంచడానికి చూపించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ సమర్థించుకున్నాయి. ఈ PSAలను సినిమా ప్రారంభానికి 10 నిమిషాల ముందు లేదా విరామం సమయంలో మాత్రమే చూపించాలని, సినిమా ప్రారంభంలో ఎక్కువసేపు యాడ్స్ లేదా ట్రైలర్స్ వల్ల ఆలస్యం కావడం కాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఆదేశం వెలువడిన 30 రోజుల్లోపు PVR ఇంకా INOX రెండూ కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్'కి జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications