రియల్ ఎస్టేట్ అమ్మకాలు కొన్ని నగరాలు, ప్రదేశాలను బట్టి మారుతుంటుంది. అయితే ఐటీకి హాట్ ప్లేస్'గా పేరు పొందుతున్న బెంగుళూరులో ఇళ్ల అద్దెలు కాదు లగ్జరీ ఇళ్ల అమ్మకాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఒక వార్త వెలువడింది. అయితే బెంగళూరులోని లగ్జరీ అపార్ట్‌మెంట్ మార్కెట్లో రూ.10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు మొదటిసారిగా రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. గత నాలుగు సంవత్సరాలుగా చూస్తే 42 శాతం అమ్మకాలు కేవలం FY25లోనే జరిగాయి, దీని బట్టి చూస్తే హై-ఎండ్ రెసిడెన్షియల్ హౌసెస్ డిమాండ్ ఎలా ఉందొ తెలుస్తుంది.

ఇండియా సోథెబైస్ ఇంటర్నేషనల్ రియాలిటీ అండ్ CRE మ్యాట్రిక్స్ రిపోర్టులో షేర్ చేసిన డేటా ప్రకారం, 5 వేల నుండి 7 వేల చదరపు అడుగుల మధ్య ఉన్న అపార్ట్‌మెంట్‌లకు డిమాండ్‌లో భారీగా పెరుగుదల కనిపించింది, దీని ద్వారా విశాలమైన, అల్ట్రా-ప్రీమియం లైఫ్ కోసం పెరుగుతున్న డిమాండ్ నొక్కి చెబుతుంది.
బెంగళూరు లగ్జరీ హౌసింగ్ మార్కెట్ కొత్త క్లబ్లోకి ప్రవేశించింది. ముఖ్యంగా చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్, స్టార్టప్ ఫౌండర్స్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు లగ్జరీ లైఫ్ స్టయిల్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే తెలివైన కొనుగోలుదారులను మనం చూస్తున్నాము అని ఇండియా సోథెబైస్ ఇంటర్నేషనల్ రియాలిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ చద్దా అన్నారు. ఈ కాలంలో బెంగళూరులోని హై-ఎండ్ లగ్జరీ అపార్ట్‌మెంట్ మార్కెట్‌లో హెబ్బల్ అగ్రగామిగా నిలిచింది, మొత్తం అమ్మకాల వాల్యూలో 22 శాతం వాటా ఇక్కడే ఉంది. అలాగే పెరుగుతున్న లగ్జరీ హబ్‌లలో దోమ్లూర్, సుధామ్‌నగర్ అండ్ బోమన్‌హల్లి కూడా ఉన్నాయి.
CRE మ్యాట్రిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ సహ వ్యవస్థాపకుడు అభిషేక్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ, ఇది కేవలం సాధారణ విషయం కాదని అన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే అల్ట్రా-లగ్జరీ అపార్ట్‌మెంట్‌లలో ఆరు కొత్త మైక్రో మార్కెట్లను మేము చూశాము. గతంతో పోల్చి చూస్తే భారీ మార్పు, అలాగే మార్కెట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఇది చూపిస్తుంది అని అన్నారు. అయితే బెంగళూరు మౌలిక సదుపాయాలు వేగమైన వృద్ధికి అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉందని అశ్విన్ చద్దా హెచ్చరించారు.
సెంచరీ రియల్ ఎస్టేట్‌లో సేల్స్, మార్కెటింగ్ & CRM డైరెక్టర్ మణీందర్ ఛబ్రా మాట్లాడుతూ బెంగళూరు అల్ట్రా-లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి ఉత్సాహాన్ని చూస్తోంది, ఇందిరానగర్‌లో మా ఫ్లాగ్‌షిప్ లగ్జరీ ప్రాజెక్ట్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే రూ.1,000 కోట్లకు పైగా అమ్మకాలను సాధించింది అని అన్నారు.
More From GoodReturns

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications