Bengaluru News: షాక్.. బెంగళూరు ఇంటి యజమానుల వద్ద సెక్యూరిటీ డిపాజిట్ రూ.31,628 కోట్లు..

సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్ కత్తా లాంటి నగరాల్లో ఇల్లు కొనాలంటే కోట్ల రూపాయలు కావాలి. ఒక వేళ ఇల్లు కొనాలనుకున్నా.. హోం లోన్ తీసుకోవాలి. ఈ హోం లోన్ ఈఎంఐలు కొందరు 60 ఏళ్ల వరకు పెట్టుకుంటారు. ఉద్యోగం చేసినన్నీ రోజులు వాయిదాల చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది అద్దె ఇంటికే పరిమితమయ్యారు. అయితే కొందరు ఇల్లు కొనడానికి స్థోమత ఉన్నా.. వారు సిటీ మారే అవకాశం ఉంటే అద్దె ఇంటిలోనే ఉంటారు. దీంతో మహా నగరాల్లో అద్దె ఇల్లు డిమాండ్ భారీగా పెరిగింది.

హైదరాబాద్ లో ఒకప్పుడు సింగిల్ బెడ్ రూమ్ రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండేది. ఇప్పుడు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెరిగింది. బెంగళూరు లాంటి మహా నగరంలో అద్దె ఇల్లు దొరకడం మహా కష్టం. ఒకవేళ ఇల్లు దొరికిన 6 నెలల నుంచి సంవత్సరం వరకు అడ్వాన్స్ తీసుకుంటారు. లక్షల్లో డిపాజిట్ తీసుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ సర్వే బయటకు వచ్చింది. అద్దె ఇంట్లోకి వచ్చే ముందు ఇంటి యజమానికి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ పై నో బ్రోకర్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. దేశంలో ఇంటి ఓనర్ల వద్ద సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో దాదాపు రూ.1.26 కోట్లు ఉన్నట్లు తెలిపింది.

ఇందుకు సంబంధించి రెంట్‌ రిపోర్ట్‌ 2026ను విడుదల చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో నో బ్రోకర్ సంస్థ అధ్యయనం చేసింది. అధ్యయనానికి సంబంధించిన నివేదికను బయట పెట్టింది. నెలవారీ అద్దె కంటే ముందస్తుగా చెల్లించే ఈ సెక్యూరిటీ డిపాజిట్లే అద్దెదారులకు అతిపెద్ద సవాలుగా ఉందని నివేదికలో పేర్కొంది. ఇంటి యజమానుల వద్ద ఇరుక్కుపోయిన సెక్యూరిటీ డిపాజిట్ మొత్తం ఎక్కువగా ఉన్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో ఉంది. ముంబైలో ఇంటి యజమానుల వద్ద సెక్యూరిటీ డిపాజిట్ దాదాపు రూ.41,156 కోట్లు ఉన్నట్లు నివేదికలో తెలిపింది.

ఇక రెండో స్థానంలో బెంగళూరు నిలిచింది. బెంగళూరులో ఇంటి ఓనర్ల వద్ద సెక్యూరిటీ మొత్తం రూ.31,628 కోట్లు ఉన్నాయి. అయితే బెంగళూరులో అద్దెకు ఉండే వారి గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అద్దెదారులు తమ సెక్యూరిటీ సొమ్ము తిరిగి ఇవ్వాలేదని.. ఒకవేళ ఇచ్చినా భారీ మొత్తం కట్ చేసుకుని ఇస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నో బ్రోకర్ సంస్థ ఇంటి యజమానుల వద్ద సెక్యూరిటీ డిపాజిట్ చేసిన మొత్తంపై నివేదిక విడుదల చేయడంతో బెంగళూరులో ఇంటి అద్దెదారుల పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది.

Rent House

బెంగళూరు తర్వాత ఢిల్లీ రూ.24,054 కోట్లు, చెన్నై రూ.17,346 కోట్లు, హైదరాబాద్‌ రూ.6,843 కోట్లు, పుణె రూ.5,015 కోట్లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సెక్యూరిటీ డిపాజిట్ల వల్ల నచ్చిన ఇంటినీ వదులుకోవాల్సి వచ్చినట్లు పలువురు అద్దెదారులు చెబుతున్నారు. బెంగళూరులో 75 శాతం మంది అద్దెదారులు తాము ఇష్టపడిన ఇంటిని కేవలం అధిక సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించలేక వదులుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు, చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి పొందే విషయంలో అద్దెదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+