బెంగళూరులో ఐటీ రంగం AI ద్వారా కుదేలైతే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా కుప్పకూలే ప్రమాదం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే బెంగళూరులో ఐటీ ఉద్యోగాల తొలగింపు ప్రభావం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రత్యక్షంగా పడనుంది. ఇప్పటికే పీజీ హాస్టల్స్, అద్దె ఇళ్లపై ఈ ప్రభావం కనిపిస్తుందంట. రానున్న రోజుల్లో వివిధ రంగాలలో AI టెక్నాలజీ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో కోడింగ్ & ప్రోగ్రామింగ్‌తో సహా కొన్ని పనులు AI టెక్నాలజీల ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ దెబ్బతో చాలా కంపెనీలు AIతో IT-సంబంధిత పనులను ఆటోమేటెడ్ చేసి ఉద్యోగులను తొలగించేస్తున్నాయి.
వెబ్‌సైట్ అసెండాస్ రిపోర్ట్ ప్రకారం, గత ఏడాది బెంగళూరులో AI కారణంగా 50 వేల మంది ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది. మన దేశంలో బెంగళూరు భారతదేశ ఐటీ రాజధానిగా కొనసాగుతుంది. లక్షలాది మంది ఐటీ నిపుణులు ఇక్కడ ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. మరోవైపు ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం ప్రతిరోజూ వేలాది మంది బెంగళూరుకి వస్తుంటారు. కానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి, ఐటీ ఉద్యోగులకు పెద్ద తలనొప్పి సృష్టించింది. ముఖ్యంగా బెంగళూరులో పనిచేస్తున్న వివిధ కంపెనీలు కొన్ని పనుల్లో మనుషులను భర్తీ చేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించడం ప్రారంభించాయి.
దింతో కొన్ని కంపెనీలు తక్కువ ఖర్చుతో ఐటీ పనులను నిర్వహిస్తున్నాయి. ఫలితంగా, ఎంట్రీ-లెవల్ హోదాలో ఉండే చాల మంది ఉద్యోగులు తొలగింపు చర్యలకు గురవుతున్నారు. బెంగళూరులోని ఐటీ రంగంపై ఏదైనా ప్రభావం మొత్తం బెంగళూరు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే బెంగళూరులో వివిధ పరిశ్రమలు ఐటీ కంపెనీలు ఇంకా అక్కడ పనిచేసే ఉద్యోగుల చుట్టూ ముడిపడి ఉంటుంది. నగరం బయట నుండి వచ్చిన చాలా మంది ఇక్కడే ఉండి పని చేస్తారు కాబట్టి, వీరి కోసం హాస్టళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంటాయి. ఐటీ ఉద్యోగులను తొలగింపుతో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పుడు వీరి పై ఆధారపడిన వివిధ వ్యాపారాలు కూడా ప్రభావితమవుతాయి.

హాస్టళ్లు, రెస్టారెంట్లు నడిపే వారు ముఖ్యంగా ప్రభావితమవుతారు. ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద సంఖ్యలో టెక్నాలజీ పార్కులు సహా ఆఫీసులు ఉన్నాయి. అందువల్ల చాలా మంది ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఐటీ రంగం కుదేలైనపుడు ఈ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఇంకా అద్దె తగ్గుతాయి. దీని వల్ల ఇంటి ఓనర్లకు సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల ఐటీ రంగంలో మందగమనం, ఉద్యోగుల తొలగింపులు కొనసాగితే బెంగళూరులో రూ. 3,000 కోట్ల అద్దె ఆదాయం ప్రభావితమవుతుందని అండ్ రియల్ ఎస్టేట్ వాల్యూ 15 నుండి 20% వరకు తగ్గవచ్చని చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications