భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ అంటే నరకమేనని చెప్పవచ్చు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ట్రాఫిక్ జామ్ వార్తల్లో నిలిచింది. రోజువారీగా ఆఫీస్‌కు వెళ్ళే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు అందరూ ట్రాఫిక్ జామ్‌లో గంటల తరబడి చిక్కుకోవడం సాధారణం అయిపోయింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం తాజాగా ఒక కొత్త ఆలోచనను ముందుకు తెచ్చింది. అదే రద్దీ పన్ను (Congestion Tax).
ఈ పన్ను ముఖ్యంగా ఒంటరిగా కారులో ప్రయాణించే డ్రైవర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR), ఇతర ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో ఒకే వ్యక్తి కారులో ప్రయాణిస్తే, అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చని ప్రతిపాదన చెబుతోంది. అయితే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటే ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుంది. దీని ఉద్దేశ్యం ఏంటంటే కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడం, ఒంటరిగా కార్లు నడపడం తగ్గించడమని చెప్పవచ్చు.

రాష్ట్రం ఈ పన్నును వసూలు చేయడానికి FASTag వ్యవస్థనే ఉపయోగించాలని ఆలోచిస్తోంది. అంటే ఎవరూ ఆగి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. వాహనం రద్దీ జోన్‌లోకి ప్రవేశించగానే, ఆ ఫీజు డ్రైవర్ FASTag నుండి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. అయితే ఇది ప్రస్తుతం ఇంకా చర్చ దశలో ఉంది. ప్రతిపాదనలు పూర్తయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రతిపాదన 2023లోనే కూడా వచ్చింది. కర్ణాటక విజన్ 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ప్లాన్‌లో భాగంగా బళ్లారి రోడ్, మైసూరు రోడ్, హోసూర్ రోడ్, తుమకూరు రోడ్ వంటి నగరంలోని తొమ్మిది ప్రధాన రహదారులపై రద్దీ పన్ను విధించాలని సిఫార్సు చేయడం జరిగింది.
ప్రభుత్వం ఈ చర్య ద్వారా నాలుగు ప్రధాన ప్రయోజనాలను ఆశిస్తోంది:
1. ట్రాఫిక్‌ను తగ్గించడం, ముఖ్యంగా ORR వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను తగ్గించాలనే లక్ష్యం .
2. కార్‌పూలింగ్, బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడం.
3. పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించడం.
4. పీక్ అవర్స్‌లో అవసరం లేని ప్రయాణాలను తగ్గించడం.
అయితే పౌరులు నిపుణుల నుంచి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో ఇంకా బలమైన ప్రజా రవాణా నెట్‌వర్క్ లేదు. బస్సులు, మెట్రో, నడక సౌకర్యాలు, కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు అందుబాటులో లేవు. అలాంటప్పుడు డ్రైవర్లపై జరిమానాలు వేయడం అన్యాయమని విమర్శలు వస్తున్నాయి. చాలా మందికి కారులో ప్రయాణం తప్ప మరో మార్గం లేకపోవచ్చు. అలాగే, సాంకేతికంగా కూడా చాలానే సవాళ్లు ఉన్నాయి. వాహనాలను ఖచ్చితంగా ట్రాక్ చేయడం, ఏ ప్రాంతం రద్దీ జోన్‌గా పరిగణించాలో నిర్ణయించడం, ఎవరికి మినహాయింపు ఇవ్వాలో నిర్ణయించడం, రియల్-టైమ్‌లో ఈ పన్నును వసూలు చేయడం వంటివి అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు.
ఈ నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా కూడా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. మధ్యతరగతి డ్రైవర్లు, సాధారణ ఉద్యోగులు కొత్త పన్ను భారం భరించాల్సి రావడంతో అసహనం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక, నిబంధనలు, మినహాయింపులు, కఠినమైన అమలు విధానాలను సిద్ధం చేయకపోతే ఈ ప్రతిపాదన ముందుకు సాగడం కష్టమవుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications