కరోనా సమయంలో భారీగా దెబ్బతిన్న రియాల్టీ రంగం, ఆఫీస్ స్పేస్ క్రమంగా కోలుకుంటోంది. గత కొంతకాలంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. జీఎస్టీ కలెక్షన్లు పెరగడం, ఈ-వే బిల్లులు పెరగడం వంటి పలు అంశాలు ఆర్థిక కార్యకలాపాల వేగానికి నిదర్శనం. వివిధ కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. సెకండ్ డోస్ వ్యాక్సీన్ పూర్తయిన తమ ఉద్యోగులు సోమవారం నుండి కార్యాలయానికి హాజరు కావాలని కంపెనీ సీఈవో నిన్న ట్వీట్ చేశారు. ఐటీ కంపెనీలు సహా వివిధ రంగాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులను క్రమంగా కార్యాలయానికి రప్పించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫీస్ స్పేస్‌కు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దాంతో గత ఏడాదితో పోలిస్తే 2020-21 సంవత్సరంలో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిందని అనరాక్ నివేదిక పేర్కొంది.
దక్షిణాదికి చెందిన ప్రముఖ నగరాలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. 2020-21 ఆర్థిక ఏడాదిలో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో 66 శాతం వాటా ఈ మూడు నగరాల నుండి ఉంది. కొత్త ఆఫీస్‌లు తీసుకోవడం, సెర్చింగ్, నెట్ అబ్సార్ప్షన్, రెంటల్ గ్రోత్ విషయంలో ప్రధాన దక్షిణ ఆఫీస్ మార్కెట్ ఇతర ప్రాంతాలను అధిగమించిందని అనరాక్ తెలిపింది.

టాప్ 7 నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 66 శాతంపెరిగింది. FY18లో మాత్రం 47 శాతం పెరిగింది. నెట్ FY21లో ఆఫీస్ అబ్సార్ప్షన్ కాంట్రిబ్యూషన్ టాప్ నగరాల్లో 21.32 మిలియన్ స్క్వైర్ ఫీట్లుగా ఉంది. ఇందులో మూడు దక్షిణాది నగరాల నుండి 14.06 మిలియన్ స్క్వైర్ ఫీట్లుగా ఉంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణే అబ్సార్బ్షన్ 4.58 మిలియన్ స్క్వైర్ ఫీట్లు (21 శాతం), ఢిల్లీ ఎన్సీఆర్ 2.3 మిలియన్ స్క్వైర్ ఫీట్లు (11 శాతం)గా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో టాప్ 7 నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజ్ 31.15 స్క్వైర్ ఫీట్లుగా ఉంది. అప్పుడు దక్షిణాది నగరాల నెట్ అబ్సార్ప్షన్ 47 శాతం, వెస్టర్న్ రీజియన్ 33 శాతం, నార్తర్న్ రీజియన్ 17 శాతంగా ఉంది. దక్షిణాది వాటా ఇప్పుడు 66 శాతానికి పెరిగింది.
ఆఫీస్ స్పేస్ డిమాండును అందిపుచ్చుకొని కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయడంలో దేశంలోని ఉత్తర, పశ్చిమ నగరాలకన్నా దక్షిణ భారత దేశ నగరాలదే పైచేయిగా ఉందని అనరాక్ నివేదిక తేల్చి చెప్పింది. ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగాలు ముందు నుండి వీటికి ఊతంగా నిలిచాయని, రెంట్ అందుబాటులో ఉండటం, కొన్నాళ్లుగా స్టార్టప్స్‌కు అనువైన పరిస్థితులు ఉండటంతో కొత్త కార్యాలయాలకు దక్షిణాది వైపు చూస్తున్నారని అంటున్నారు. వీటితోపాటు ఈ మధ్యకాలంలో ఉత్పత్తి, పారిశ్రామిక రంగాలు సైతం ఇటువైపు చూస్తున్నాయని సర్వే పేర్కొంది.
మూడేళ్లలో ఈ నగరాల్లో రెంట్లు గణనీయంగా పెరిగాయి. 2018-21 మధ్యకాలంలో ఆఫీస్ అద్దెల్లో రెండంకెల వృద్ధిరేటు కనిపించది. బెంగళూరు 15 శాతం, హైదరాబాద్ 12శాతం, చెన్నై 11 శాతం పెరుగుదలతో ఉన్నాయి. దక్షిణాది నగరాలకు కలిసి వచ్చిన అంశాల్లో ఐటీ, ఐటీ సేవల కంపెనీల నుండి డిమాండ్, అందుబాటులో లీజింగ్ రెంటల్స్, స్టార్టప్స్, పారిశ్రామిక, తయారీ రంగాలు పుంజుకోవడం.


Click it and Unblock the Notifications