బెంగళూరులో గృహ కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రధాన రహదారికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లు అధిక డిమాండ్‌లో ఉండేవి. అయితే ఇప్పుడు Bengaluru నగరంలోని అధిక ట్రాఫిక్ కారిడార్ల కారణంగా పెరుగుతున్న దుమ్ము, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వల్ల చాలా మంది కొనుగోలుదారులు ప్రధాన రహదారులను దూరంగా పెట్టి.. 100 నుంచి 200 మీటర్ల లోపల ఉన్న పొల్యూషన్ లేని బైలేన్‌లలోని అపార్ట్‌మెంట్‌లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ప్రకారం.. Bengaluru లో ఈ మార్పు కొనుగోలుదారుల ప్రాధాన్యతలను పూర్తిగా తిరిగి రూపొందిస్తోంది. ప్రధాన రహదారికి ఎదురుగా ఉన్న ఇళ్లకు మెరుగైన వీక్షణ, ఎక్కువ వెలుతురు, వెంటిలేషన్ వంటి ఆకర్షణలు ఉన్నప్పటికీ.. అవి దీర్ఘకాలిక నివాసానికి సమస్యలుగా మారుతున్నాయని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ముఖ్యంగా వాహనాల ఎగ్జాస్ట్, PM2.5, PM10 వంటి సూక్ష్మ కాలుష్య కణాలు, డీజిల్ పొగలు, నిరంతర నిర్మాణ ధూళి రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

ఫ్లాట్ కొనుగోలు కోసం వెతుకుతున్న ఒక వ్యక్తి రెడ్డిట్‌లో తన అనుభవాన్ని పంచుకుంటూ.. బ్రోచర్‌లో కార్నర్ ఫ్లాట్‌లు, మెయిన్ రోడ్ వ్యూ అపార్ట్‌మెంట్‌లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ నేటి బెంగళూరు వాస్తవికతలో అవి రోజూ ఎదురయ్యే తలనొప్పిగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఉదయం శుభ్రం చేసిన బాల్కనీ, సాయంత్రానికి మళ్లీ దుమ్ముతో నిండిపోవడం సాధారణమైపోయిందని ఆయన వివరించారు. అందుకే సైలెంట్ ఇన్నర్ లేన్ ఫ్లాట్ ఏ మెయిన్ రోడ్ వ్యూ కంటే మెరుగైనదిగా అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైట్‌ఫీల్డ్‌లో ఇల్లు వెతుకుతున్న మరో కొనుగోలుదారు.. ప్రధాన రహదారి నుంచి కొద్దిగా దూరంగా ఉన్న బైలేన్‌లలోనే అపార్ట్‌మెంట్ కావాలని స్పష్టంగా చెబుతున్నాడు. ప్రధాన రహదారికి దూరంగా ఉండే లేఅవుట్‌లు, ప్రతి అంతస్తుకు తక్కువ యూనిట్లు, అంతర్గతంగా ఉన్న బాల్కనీలు ఉన్న ఫ్లాట్‌లు చాలా ప్రశాంతంగా ఉంటాయి. శుభ్రమైన గాలి, తక్కువ శబ్దం, తక్కువ దుమ్ము వల్ల జీవన నాణ్యత మెరుగ్గా ఉంటుందని ఆయన తెలిపారు.
నగర కేంద్రంలో నివసిస్తున్న ఒక కుటుంబం కాలుష్యం.. ట్రాఫిక్ సమస్యల కారణంగా ఉత్తర బెంగళూరులోని దేవనహళ్లికి మారాలని నిర్ణయించుకుంది. కార్యాలయం నగరంలోనే ఉన్నప్పటికీ, వారానికి కొన్ని రోజులు మాత్రమే ప్రయాణించాల్సి ఉండటంతో, ప్రశాంత వాతావరణం కోసం బయటకు మారడం మంచిదని భావించామని వారు చెప్పారు.
రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం.. ప్రధాన రహదారి ఆస్తులు పెట్టుబడుల పరంగా వేగంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, తుది వినియోగం కోసం కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు పర్యావరణం బైలేన్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. హను రెడ్డి రియాలిటీకి చెందిన కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో బైలేన్‌లలోని అపార్ట్‌మెంట్‌లు ప్రధాన రహదారి ఆస్తుల కంటే ఎక్కువ ధరలను కూడా పొందుతున్నాయి. కొనుగోలుదారులు శాంతియుత పరిసరాలు, తక్కువ కాలుష్యం కోసం ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
అయితే రిచ్‌మండ్ టౌన్ వంటి కేంద్ర ప్రాంతాల్లో ప్రధాన రహదారి అపార్ట్‌మెంట్‌లు ఇంకా అధిక ధరలకు విక్రయమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో డిమాండ్ స్పష్టంగా నిశ్శబ్ద అంతర్గత వీధుల వైపు మళ్లుతోంది. పరిశుభ్రమైన గాలి, తక్కువ శబ్దం, దీర్ఘకాలిక నివాసయోగ్యత ఇప్పుడు గృహ కొనుగోలుదారుల ప్రధాన ప్రమాణాలుగా మారాయని రియల్ ఎస్టేట్ రంగ నిఫుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications