కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇంటి కొనుగోలుదారుడు తన ఇంటిని స్వాధీనం చేసుకోవడంలో మూడు సంవత్సరాల ఆలస్యం కారణంగా బిల్డర్ నుండి రూ. 70 లక్షలు పరిహారంగా పొందాడు. ఈ కేసులో అతనికి రెరా చట్టం కీలక ఆధారంగా మారింది. బిల్డర్ ను నమ్మి డబ్బులు ఇచ్చినందుకు అతను సమయానికి ఇంటిని అందించకపోవడంతొ ఈ నష్టపరిహారం చెల్లించాలని కోర్టు బిల్డర్ కు ఆదేశాలు ఇచ్చింది. మరి ఈ రెరా చట్టం ఏమి చెబుతోంది. అసలు కేసు పూర్వాపరాలు ఏంటీ ఓ సారి చూద్దాం.
బెంగళూరులో ఓజోన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రాజెక్ట్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఓ ప్రాజెక్ట్ కడుతోంది. ఒక గృహ కొనుగోలుదారు అది బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటంతో ఇంటి అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయాలనుకున్నాడు. సెప్టెంబర్ 5 2018న ఇందుకోసం రూ. 51 లక్షల పూర్తి కొనుగోలు ధర (రూ.51,39,093) చెల్లించాడు. ఈ మొత్తం చెల్లించడానికి అతను ప్రైవేట్ సంస్థ నుండి లోన్ కూడా తీసుకున్నాడు. 2018లో ఈ లావాదేవీలు జరగగా బిల్డర్ 2021 నాటికి అందిస్తానని అమ్మకపు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే బిల్డర్ వాగ్దానం చేసిన 2021 తేదీ దాటి మూడు ఏళ్లు గడిచినా ఇల్లు అతని చేతికి అందలేదు. 2025 వచ్చినా బిల్డర్ ఇప్పటికీ నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. దీంతో దాని అభివృద్ధి లైసెన్స్ కూడా గడువు ముగిసింది.

దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు RERA (రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టం 2016లోని సెక్షన్ 18 కింద తన చట్టపరమైన హక్కులను వినియోగించుకున్నాడు. ఈ చట్టం ద్వారా కర్ణాటక RERA ట్రిబ్యునల్‌లో బిల్డర్‌పై కేసు దాఖలు చేశాడు. జూలై 1లో ఈ కేసు దాఖలు చేయగా విచారించిన ధర్మాసనం బాధితునికి అనుకూలంగా తీర్పును వెలువరించింది.
ఇల్లు ఆలస్యానికి బిల్డర్ ని బాధ్యుడిని చేస్తూ నష్ట పరిహారం కింద ఇంటి కొనుగోలుదారు చెల్లించిన రూ.51 లక్షలు తిరిగివ్వాలని ఆదేశించింది. ఆ మొత్తంతో పాటు మూడేళ్ల కాలానికి వడ్డీ రూ. 19 లక్షలకు కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 60 రోజుల్లోపు పూర్తిగా బాధితుడుకి చెల్లించాలని కర్ణాటక రెరా బిల్డర్‌ను ఆదేశించింది.ఈ తీర్పు ద్వారా బిల్డర్ ఇంటి కొనుగోలుదారుకు అసలు వడ్డీ మొత్తం కలిపి రూ. 70 లక్షలు (రూ. 70,33,424) చెల్లించాల్సి వచ్చింది.
ఈ కేసులో బాధితుడికి రెండు సుప్రీంకోర్టు తీర్పులు సాయపడ్డాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. బిల్డర్ తన బాధ్యతల్లో విఫలమైతే గృహ కొనుగోలుదారులు RERA చట్టంలోని సెక్షన్ 18 లేదా దాని ఉపనిబంధనల కింద చట్టపరమైన హక్కులు వినియోగించుకోవచ్చు. ఈ కేసులో.. బెంగళూరు గృహ కొనుగోలుదారు తన హక్కులను రక్షించుకునేందుకు ప్రత్యేకంగా సెక్షన్ 18 కింద న్యాయపరమైన చర్యను ఎంచుకున్నారు.
సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం గృహ కొనుగోలుదారు ప్రాజెక్ట్‌ను విడిచిపెట్టకుండా కొనసాగించాలని నిర్ణయిస్తే.. RERA చట్టంలోని సెక్షన్ 18(1) నిబంధన వర్తిస్తుంది. అలాంటి పరిస్థితిలో..బిల్డర్ ఇంటిని కొనుగోలుదారునికి స్వాధీనం చేసే వరకు ప్రతి నెల ఆలస్యానికి వడ్డీ చెల్లించాలి. ఇక RERA చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం బిల్డర్ ఒప్పందంలో పేర్కొన్న తేదీకి అపార్ట్‌మెంట్‌ను పూర్తి చేయకపోతే గృహ కొనుగోలుదారు ప్రాజెక్ట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న సందర్భంలో బిల్డర్ ఇంటి కోసం తీసుకున్న కొనుగోలు దారు దగ్గర తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications