Bengaluru News: ప్రస్తుతం ఐటీతో పాటు స్టార్టప్, ఏఐ రంగాల్లో కొత్త కంపెనీలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న వేళ బెంగళూరు నగరం దానికి అనుగుణంగా విస్తరిస్తోంది. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ మేరకు ప్రజా రవాణా వ్యవస్థలను మెరుగుపరుస్తోంది. అలాగే రద్దీని తగ్గించటానికి కొత్త నగరాన్ని కూడా బెంగళూరు సివార్లలో ఏర్పాటుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
అయితే ఈ క్రమంలో నగరంలో అవసరాలకు అనుకూలంగా రెండవ విమానాశ్రయాన్ని తీసుకురావటానికి కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక్కడ అసలు ట్విస్టు ఉంది. అవును ముగ్గురు మంత్రులు దానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటూ పోటీకి దిగటంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ మంత్రులు తమ జిల్లాలకు దానిని తీసుకెళ్లాలని లాబీయించ్ కూడా చేయటంతో ప్రభుత్వం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కర్ణాటక ప్రభుత్వంలోని వ్యక్తుల నుంచి అందిన సమాచారం ప్రకారం నీలమంగళ కునిగల్ ప్రాంతాలకు మధ్యలో ఉన్న బిడది, హరోహళ్లి, సోలూర్ కొత్త ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే.. బిడది, హరోహళ్లి ప్రాంతాలు ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి మంత్రి డి కె శివకుమార్ సొంత జిల్లా అయిన రామనగర జిల్లాలోకి వస్తాయి. ఇదే క్రమంలో సోలూర్ బెంగళూరు రూరల్ జిల్లా కిందకు వస్తుందని వెల్లడైంది. ఈ సమాచారం బయటకు రావటంతో ఈ ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ ఆస్తులపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు.
రెండవ విమానాశ్రయ ఏర్పాటు విషయంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నారు. శివకుమార్ రామానగరాకు దీనిని కోరుతుండగా.. మరో మంత్రి పరమేశ్వర తుముకూరులో ఏర్పాటు కోసం లాబీయింగ్ చేస్తున్నారు. దీనికోసం రెండు చోట్లు 3-5 వేల ఎకరాల అనుకూలమైన స్థలాన్ని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. మెుత్తంగా గత ఏడాదిలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు 7 ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసినప్పటికీ చివరికి అన్ని విధాలా అనుకూలమైనదాన్ని మాత్రమే ఎంపిక చేసి సీఎం ఎయిర్ పోర్ట్ అథారిటీకి పంపిస్తారని మంత్రులు చెబుతున్నారు.
ఉత్తర బెంగళూరులో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి నాంది పలికిన దేవనహళ్లిలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మాదిరిగానే.. ప్రస్తుతం నిర్మాణమయ్యే రెండవ విమానాశ్రయం కూడా రియల్ ఎస్టేట్ ధరలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సంస్థలు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా దీనికి అనుగుణంగా వస్తాయని వారు చెబుతున్నారు. అయితే దీనిని మంచి పెట్టుబడి అవకాశంగా ఐటీ ఉద్యోగులు ఉపయోగించుకుంటే నగరంతో పాటు వారు కూడా అభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరులో స్థిరపడాలనుకుంటున్న టెక్కీలకు ఇదొక మంచి పెట్టుబడి సదవకాశంగా చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications