బెంగళూర నగరంలోని చిన్న నివాస భవనాల యజమానులకు కర్ణాటక ప్రభుత్వం పెద్ద ఉపశమనం కల్పించింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) పరిధిలో 1,200 చదరపు అడుగుల (సుమారు 30×40 అడుగుల) విస్తీర్ణంలో నిర్మించబడిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (Occupancy Certificate - OC) తప్పనిసరి కాదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, గ్రౌండ్ + 2 అంతస్తులు లేదా స్టిల్ట్ + 3 అంతస్తులు (parking + 3 floors) వరకు నిర్మాణం ఉన్న చిన్న భవనాలు ఇప్పుడు OC లేకుండా అనుమతి పొందగలవు. దీని వల్ల మధ్యతరగతి, చిన్న స్థాయి గృహ యజమానులకు పెద్ద ఊరట లభించనుంది.
OC అంటే ఏమిటి? : ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది, భవనం పూర్తయిన తరువాత, అది ఆమోదించబడిన ప్రణాళికకు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అధికారికంగా ధృవీకరించే పత్రం. OC లేకుండా భవనంలో నివసించడం చట్టపరంగా అనుమతించబడదు. ఇంతవరకు, బెంగళూరులో కూడా చిన్న ఇళ్లకు OC తీసుకోవడం తప్పనిసరి కావడంతో గృహ యజమానులు BBMP, ఇతర అధికారుల వద్ద అనేక అడ్డంకులు ఎదుర్కొనేవారు.

గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ యాక్ట్, 2024లోని సెక్షన్ 241(7) ప్రకారం ప్రభుత్వం తన అధికారాలను వినియోగించి ఈ మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు ఆమోదించబడిన ప్రణాళికల ప్రకారం నిర్మించబడిన, పట్టణ ప్రణాళిక నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉన్న భవనాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, నియమాలు ఉల్లంఘించిన లేదా అనధికారిక నిర్మాణాలు ఈ సౌకర్యం పొందవు. అదనంగా, ప్రభుత్వం OC మినహాయింపు పొందిన భవనాలకు విద్యుత్, నీటి, మలినాల కలయిక వంటి కనెక్షన్లు ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకి ఉండదని తెలిపింది. ఇది భవిష్యత్తులో చిన్న ఇళ్లకు సేవలు సులభంగా అందించే మార్గాన్ని సుగమం చేస్తుంది.
ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. Bengaluru లో చిన్న స్థాయి గృహ యజమానులపై పరిపాలనా భారాన్ని తగ్గించడం, అనవసర అధికార ప్రక్రియలను సులభతరం చేయడంగా చెప్పుకోవచ్చు. చాలా మంది చిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించి OC కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసేవారు. ఇప్పుడు, OC మినహాయింపుతో వారి ఇళ్లు త్వరగా వినియోగంలోకి రావడం సాధ్యమవుతుంది.
రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది గృహ యజమానులకు, చిన్న బిల్డర్లకు ఒక ప్రోత్సాహక చర్యగా చెప్పవచ్చు. 30×40 సైట్లలో గృహ నిర్మాణం మరింత వేగంగా సాగుతుందని బెంగళూరు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు.అయితే నిబంధనలు ఉల్లంఘించిన లేదా అదనంగా అంతస్తులు వేసే నిర్మాణాలు OC మినహాయింపు కింద రాకపోవడం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన లేదా అదనంగా అంతస్తులు వేసే నిర్మాణాలు OC మినహాయింపు కింద రాకపోవడం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఏదేమైనా ఈ OC మినహాయింపు నిర్ణయం, బెంగళూరులో గృహనిర్మాణ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా, ప్రభుత్వ-ప్రజల మధ్య ఉన్న పరిపాలనా ఆటంకాలను తగ్గించనుంది. చిన్న స్థలాల్లో ఇల్లు నిర్మించాలనుకునే వారికి ఇది ఒక పాజిటివ్ పాలసీ మార్పుగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications