నేటి కాలంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామనేది కూడా అంతే చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా 'జెన్-జీ' (Gen Z) , 'మిలీనియల్స్' మధ్య ఖర్చుల విషయంలో ఎప్పుడూ ఒక కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బెంగళూరు (Bengaluru) కు చెందిన శ్రద్ధా సైని అనే 22 ఏళ్ల యువతి తన నెలవారీ వ్యక్తిగత ఖర్చుల గురించి సోషల్ మీడియాలో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. కేవలం తన సొంత ఎంజాయ్‌మెంట్, మానసిక ప్రశాంతత కోసం ఆమె నెలకు ఏకంగా రూ. 25,000 ఖర్చు చేస్తోంది.

ఆ పాతిక వేలు దేని కోసం?
శ్రద్ధా తన వీడియోలో తన ఖర్చుల వివరాలను చాలా ఓపెన్‌గా వివరించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం, తన సంతోషం కోసం నెలకు రెండు మూడు సార్లు పూలు కొనుక్కుంటుంది. దీనికి సుమారు రూ. 2,000 ఖర్చవుతుంది. ఇక తన మెంటల్ హెల్త్ కోసం థెరపీ సెషన్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికోసం నెలకు ఏకంగా రూ. 10,000 కేటాయిస్తోంది. ఇవి కాకుండా ప్రతి ఆదివారం బయట బ్రంచ్ (Brunch) చేయడం.. నెలకు సుమారు రూ. 2,000 వరకు దానికే సరిపోతుంది. ఇక మిగిలిన డబ్బును మసాజ్‌లు, పెడిక్యూర్లు, నెయిల్ అపాయింట్‌మెంట్ల వంటి పర్సనల్ గ్రూమింగ్ కోసం వాడుతోంది.
జెన్-జీ వర్సెస్ మిలీనియల్స్ చర్చ
ఈ వీడియో చూసిన మిలీనియల్స్ (1981-1996 మధ్య పుట్టినవారు) షాక్ కు గురవుతున్నారు. ఒకప్పుడు సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచించే తరం ఇప్పుడు తమపై తాము ఇంత భారీగా ఖర్చు పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. మిలీనియల్స్ అభిప్రాయం ప్రకారం.. సెల్ఫ్ కేర్ ముఖ్యం కానీ, బాధ్యతలు కూడా అంతే ముఖ్యం. "మేము కూడా మా కోసం ఖర్చు పెడతాం, కానీ అది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటాం" అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
బెంగళూరు లైఫ్ స్టైల్ అండ్ సెల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్
బెంగళూరు (Bengaluru) లాంటి కాస్మోపాలిటన్ నగరాల్లో ఇలాంటి ఖర్చులు సహజమని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు ఇది కేవలం 'ప్రివిలేజ్' (అవకాశం ఉండటం) మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. అయితే శ్రద్ధా మాత్రం తన మానసిక ఆరోగ్యానికి, ప్రశాంతతకు ఇచ్చే విలువ ముందు ఈ డబ్బు పెద్ద విషయం కాదని అంటోంది. ఒక తరం దీనిని అనవసరపు ఖర్చు (Excess) అని భావిస్తే, మరో తరం దీనిని తమ మీద తాము చేసుకునే పెట్టుబడి (Self-investment) అని పిలుస్తోంది.
ఏది ఏమైనా మనీ మేనేజ్‌మెంట్ విషయంలో రెండు తరాల మధ్య ఉన్న ఈ అగాధాన్ని ఈ వైరల్ వీడియో మరోసారి బయటపెట్టింది. మీరు కూడా మీ పర్సనల్ కేర్ కోసం ఇంతే ఖర్చు పెడతారా? లేదా పొదుపు వైపు మొగ్గు చూపుతారా?
More From GoodReturns

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

కేవలం SIP ఉంటే సరిపోదు.. మీ సంపదను కాపాడే 'మినిమాక్స్' సూత్రం మీకు తెలుసా?

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications