బెంగళూరు (Bengaluru) మహానగరం చుట్టూ రియల్ ఎస్టేట్ మార్కెట్ రూపురేఖలు మారిపోతున్నాయి. మెగా-ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో ప్రభుత్వ పెట్టుబడులు, మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రాక కారణంగా నగర శివార్లలోని కొన్ని ప్రాంతాలు శాటిలైట్ టౌన్స్ (Satellite Towns) గా మారుతున్నాయి.

మెయిన్ సిటీపై పూర్తిగా ఆధారపడకుండా, సొంత ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండే చిన్న టౌన్స్ ను శాటిలైట్ టౌన్స్ అంటారు. బెంగళూరు చుట్టూ ఉన్న ఈ శాటిలైట్ టౌన్స్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏటా 18% నుండి 22% వరకు పెరుగుతుండటం విశేషం. రాబోయే 2026లో అత్యధిక వృద్ధి అవకాశాలు ఉన్న టాప్ 5 శాటిలైట్ టౌన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
1. దేవనహళ్లి (Devanahalli)
ఇక్కడ ప్రధాన ఆకర్షణ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ టౌన్ కు ఎయిర్ పోట్స్ 5 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం చదరపు అడుగు ధర సగటున రూ.9,000 ఉంది. రాబోయే 2-3 ఏళ్లలో 30-40% పెరుగుదల ఉండొచ్చని అంచనా. ఇక్కడ శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ (STRR) కనెక్టివిటీ, ఫోక్స్‌కాన్ (Foxconn) ఫ్యాక్టరీ కార్యకలాపాలు అలాగే 2026 మధ్య నాటికి పూర్తి కానున్న నమ్మ మెట్రో బ్లూ లైన్ పొడిగింపు ఈ ప్రాంతానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి.
2. హోస్కోటే (Hoskote)
ఇక్కడ రియల్ ఎస్టేట్ గత ఐదేళ్లలో 70.6% విలువ పెరిగింది. ఇక్కడ చదరపు అడుగు ధర ఇప్పటికీ రూ.7,000 వద్ద అందుబాటులో ఉంది. మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్ కారణంగా ఈ ప్రాంతం ఫ్యూచర్ లో లాజిస్టిక్స్, వేర్‌హౌస్ హబ్‌గా మారే అవకాశం ఉంది. STRR ద్వారా తమిళనాడు సరిహద్దుకు కనెక్టివిటీ మెరుగుపడటం అతిపెద్ద సానుకూల అంశం.
3. నెలమంగళ (Nelamangala)
ఇక్కడ రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదల ఏటా 22% గా ఉంది. చదరపు అడుగు ధర రూ.6,000 ఉంది. ఇది తక్కువ ధరకు అందుబాటులో ఉన్నందున ఇక్కడ డెవలప్ మెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పెరిఫెరల్ రింగ్ రోడ్ (PRR), STRR కూడలి వద్ద ఉండటం వలన లాజిస్టిక్స్ కార్యకలాపాలకు అద్భుతమైన వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుంది. దీంతోపాటు ఇక్కడ ప్రతిపాదించిన విమానాశ్రయం ప్రాజెక్ట్ అధికారికంగా ధృవీకరించబడితే.. భూమి విలువ 30-50% పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
4. మాగడి (Magadi)
ఇక్కడ కూడా పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇక్కడ ధరలు రూ.7,000 నుండి ప్రారంభమవుతున్నప్పటికీ.. ఇది లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్‌తో ముడిపడిన దీర్ఘకాలిక పెట్టుబడికి విలువైన ప్రాంతంగా గుర్తించబడింది. ఇది STRR, మాగడి రోడ్ ఎక్స్‌ప్రెస్ వే ద్వారా దక్షిణాది కర్ణాటక కంపెనీలకు వేర్‌హౌసింగ్ ప్రాంతాలను సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
5. దొడ్డబళ్ళాపూర్ & బిడాడి (Doddaballapur & Bidadi)
దొడ్డబళ్ళాపూర్ టౌన్.. KHIR సిటీ (ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం), ఫోక్స్‌కాన్ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉంది. STRR పూర్తి కానుందనే ఆశతో ఇక్కడ ఆస్తి ధరలు 20% పెరిగాయి. ఇక బిడాడిలో టయోటా వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. అలాగే బెంగళూరు-మైసూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ (BMIC) కారణంగా ఇది ఒక ఆటోమోటివ్ హబ్‌గా మారింది.
ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన విషయం
ఈ శాటిలైట్ టౌన్స్ లోని మౌలిక సదుపాయాల కల్పన, తయారీ పరిశ్రమల విస్తరణ రాబోయే కొన్నేళ్లలో ఆస్తి విలువలను మరింత పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడికి రవాణా సౌకర్యం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటం వలన నివాస మరియు వాణిజ్య డిమాండ్ పెరగనుంది. అయితే పెట్టుబడిదారులు సరైన అవగాహన, నిపుణుల సూచన మేరకు పెట్టుబడి పెట్డడం మంచిది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications