Shivaji Military Hotel: హైదరాబాద్ అనగానే ఫుడ్ లవర్స్ కి అనేక హాట్ స్పాట్స్ ఉన్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఏళ్లుగా రుచికరమైన చిరుతిళ్ల నుంచి డైనింగ్ వరకు వివిధ ఆహారాలను అందిస్తున్న ఫేమస్ స్పాట్స్ ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాదీలకు చేరువ అయ్యేందుకు ఇటీవలి కాలంలో కర్ణాటక నుంచి అనేక ఫేమస్ ఫుడ్ చైన్ సంస్థలు తమ ఔట్ లెట్లను ప్రస్తుతం మహానగరానికి వస్తున్నాయి.
అవును ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బెంగళూరుకు చెందిన లెజెండరీ శివాజీ మిలిటరీ హోటల్ రాక గురించే. నోరూరించే నాన్ వెజ్ రుచికరమైన ఆహారాలను అందించటంలో కంపెనీ ముందు వరుసలో ఉంది. ప్రధానంగా ఈ రెస్టారెంట్ దొన్నె బిర్యానీ, మటన్ ఫ్రై వంటకాలతో ప్రజాధరణను అందుకుంది. అయితే ప్రస్తుతం ఈ సంస్థ తన ఎంట్రీని హైదరాబాదుకు విస్తరించాలని నిర్ణయించింది. ఈనెలలో నగరంలోని మాధాపూర్ ప్రాంతంలో తన స్టోర్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తోంది. 1935లో స్థాపించబడి దాదాపు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ఫేమస్ హోటల్ తొలిసారిగా విస్తరణను ప్రారంభించింది.

ప్రస్తుతం హైదరాబాద్ బిర్యాని ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేళ తాము కూడా ఆహార ప్రియులకు రుచులను అందించటానికి హైదరాబాదుకు విస్తరిస్తున్నట్లు శివాజీ మిలిటరీ హోటల్ యజమాని రాజీవ్ వెల్లడించారు. బెంగళూరులో మాదిరిగానే హైదరాబాదులో తమ ఔట్లెట్ అర్థరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, తమ దొన్నె బిర్యానీని హైదరాబాదీల్లో పెరుగుతున్న డిమాండ్ తమ నిర్ణయం సరైనగా నిరూపించిందని అన్నారు. దీనికి తోడు అనేక బెంగళూరుకు చెందిన ఫేమస్ ఫుడ్ సంస్థలు కూడా హైదరాబాదును గమ్యస్థానంగా భావిస్తున్నాయి.
హోస్ కోట్ ఫేమస్ 4 ఏఎం బిర్యానీ సైతం ప్రస్తుతం నగరంలో అనేక ప్రాంతాల్లో ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. అలాగే గత ఏడాది రామేశ్వరం కెఫే సంస్థ సైతం బెంగళూరు నుంచి హైదరాబాదుకు తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇడ్లీ నుంచి దోసె వరకు వివిధ దక్షిణాది ఆహారాలను రుచికరంగా అందించటంలో సంస్థ మంచి గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications