బెంగళూరు ప్రజలకు బిగ్ షాక్.. వచ్చే మూడు నెలలు పాటు కరెంట్ బిల్లులు మోత.. ఎంత పెరగనుందంటే..

Bengaluru Electricity Bills: కర్ణాటకలోని విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం చేదు వార్త అందించింది. సెప్టెంబరు నెలలో పెరిగిన గరిష్ట డిమాండ్‌ను తట్టుకునేందుకు బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసిన ఇంధన శాఖ.. ఆ అదనపు వ్యయాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్ధమైంది. దీంతో రాబోయే మూడు నెలల పాటు రాష్ట్రంలోని వినియోగదారులు విద్యుత్‌కు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ లిమిటెడ్ (బెస్కామ్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శివశంకర వివరాలు వెల్లడిస్తూ.. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఇంధన కొనుగోలు ధర వ్యయ సర్దుబాటు (FPPCA) కింద యూనిట్‌కు సుమారు 0.5 పైసల చొప్పున అదనపు ఛార్జీని విద్యుత్ బిల్లులలో ప్రత్యేక కాలమ్‌ ద్వారా వసూలు చేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా యూనిట్‌ విద్యుత్‌ను రూ. 6 నుండి రూ. 6.15 లభించేదని.. అయితే సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ పెరగడంతో బహిరంగ మార్కెట్ నుండి యూనిట్‌కు ఏకంగా రూ. 10 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఈ వ్యయాన్ని దశలవారీగా ప్రజలపై బదిలీ చేస్తున్నామని ఆయన వివరించారు.

Bengaluru Electricity Bill BESCOM Electricity Bill Bangalore Power Tariff Electricity Price Hike BESCOM True Up Charges Karnataka Electricity News Electricity Bill Increase Bengaluru Power Rates KERC Gruha Jyothi Scheme Electricity Bill News Telugu

పీక్ అవర్స్‌లో (ఉదయం, సాయంత్రం వేళల్లో) డిమాండ్‌ను నియంత్రించడం సవాలుగా మారిన నేపథ్యంలో ఇంధన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు వంటి భారీ విద్యుత్ ఉపకరణాలను పీక్ అవర్స్ లేని సమయంలో వాడాలని కోరుతూ త్వరలోనే ప్రజలకు ఒక అడ్వైజరీ జారీ చేయనుంది. అలాగే, మార్కెట్‌లో పరిస్థితి చక్కబడే వరకు వేసవి మరియు ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేసేందుకు వ్యవసాయ శాఖతోనూ సంప్రదింపులు జరుపుతోంది.

Also Read

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 11న రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 20,094 మెగావాట్ల (20 గిగావాట్లు) గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత వేసవి మార్చిలో నమోదైన 18,655 మెగావాట్ల రికార్డును ఇది దాటేసింది. ప్రస్తుతం రోజువారీ వినియోగం 340 నుండి 360 మిలియన్ యూనిట్ల (MU) మధ్య ఉ ఊగిసలాడుతోంది. రుతుపవనాలు బలహీనపడటం, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వ్యవసాయ పంపుసెట్లు, ఏసీల కూలింగ్ లోడ్ విపరీతంగా పెరిగింది. మరోవైపు జలాశయాల్లో నీటి నిల్వలు 60 శాతానికే పరిమితమవ్వడంతో లోడ్ థర్మల్, సౌర రంగానికి మళ్లింది. డిమాండ్ అంచనాలను మించడంతో రాష్ట్రంలో పలుచోట్ల నిర్వహణ పనుల పేరిట అధికారిక/అనధికారిక కోతలు విధిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి (ఉచిత విద్యుత్) పథకం నుంచి రాష్ట్రంలోని 1.65 కోట్ల మంది లబ్ధిదారులలో సుమారు 1.3 లక్షల మంది స్వచ్ఛందంగా వైదొలిగినట్లు ఇంధన శాఖ గణాంకాలు వెల్లడించాయి. అక్టోబర్ 31తో ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ధృవీకరణ ప్రక్రియ ముగియనుంది. అంతేకాకుండా, ఇకపై గృహజ్యోతి పథకానికి కర్ణాటకకు చెందిన ఓటర్లు మాత్రమే అర్హులని ప్రభుత్వం స్పష్టం చేయడంతో, కొత్త నమోదు ప్రక్రియలో ఓటర్ ఐడీ వివరాలను నిర్బంధంగా సేకరించాలని ఇంధన శాఖ నిర్ణయించింది.

ఇంధన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా స్పందిస్తూ.. కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలోనూ విద్యుత్ డిమాండ్ 30-35% పెరిగిందని, అయితే అంతర్రాష్ట్ర విద్యుత్ కొనుగోళ్ల ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+