IKEA News: దేశంలోని మెట్రో నగరాల్లో ఉండే చాలా మంది ప్రజలకు ఐకియా తెలుసు. 1943లో స్వీడన్‌లో స్థాపించబడిన కంపెనీ.. ఫర్నిచర్, గృహోపకరణాలను స్వయంగా డిజైన్ చేసి, తయారుచేసి విక్రయిస్తోంది. కనీసం 2008 నుంచి విడిగా ఫర్నిచర్ అమ్మడంలో ప్రపంచంలోనే నెం.1 కంపెనీగా నిలిచింది. 2017 నవంబర్ నాటికి 49 దేశాల్లో 415 స్టోర్లను కలిగి ఉంది.
అయితే స్వీడిష్ ఫర్నీచర్ రిటైలర్ IKEA బెంగళూరులోని ఒక కస్టమర్‌కు రీఫండ్ ఇవ్వాలని వినియోగదారు కోర్టు ఆదేశించింది. ఆమె స్టోర్లో కొనుగోలు చేసిన వస్తువులను తీసుకెళ్లడానికి పేపర్ బ్యాగ్‌కు ఛార్జీ విధించినందుకు పరిహారంగా రూ.3,000 చెల్లించాలని ఆదేశించింది. వడ్డీతో కలిపి కవర్ కి రూ.20, నష్టపరిహారం రూ.1,000, న్యాయపరమైన ఖర్చులకు రూ.2,000 చెల్లించాలని ఆదేశించింది.

దీనికి అసలు కారణం కంపెనీ తన లోగోను ముద్రించిన క్యారీ బ్యాగ్ ను కస్టమర్లకు విక్రయించటమే. ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా కోర్టు పేర్కొంది. వివరాల్లోకి వెళితే సంగీత బోహ్రా అనే వినియోగదారు అక్టోబర్ 6, 2022న కర్ణాటకలోని IKEA నాగసాంద్ర బ్రాంచ్‌ని సందర్శించి, కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఒక క్యారీ బ్యాగ్ ఆమె కోరింది. అయితే స్టోర్ లోగో ముద్రించి ఉన్న బ్యాక్ పై రూ.20 వసూలు చేయటంతో ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.
వస్తువులను డెలివరీ చేసే స్థితిలో ఉంచేందుకు అవసరమైన అన్ని ఖర్చులను విక్రేతలే బరించాల్సి ఉంటుందని స్టేక్ కమిషన్ పేర్కొంది. ఇదే క్రమంలో వినియోగదారులు తమ సొంత బ్యాగులను తీసుకెళ్లేందుకు ఐకియా యజమాన్యం అనుమతించటం లేదని గుర్తించింది. ఒక వినియోగదారుడు 15 ప్రదేశాల్లో 15 వివిధ వస్తువులను కొనుగోలు చేసినప్పడు అందుకోసం ప్రత్యేకంగా ఇంటి నుంచి అన్ని క్యారీబ్యాగులు తీసుకువాలని మేము ఊహించటం లేదంటూ న్యాయస్థానం పేర్కొంది. ఇందులో ఇచ్చిన తీర్పు ప్రకారం విధించిన జరిమానాను 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications