ఐసీయూలో సీఈఓ.. ఉద్యోగం కాదు ఆరోగ్యం ముఖ్యం అంటూ పోస్ట్: సోషల్ మీడియాలో వైరల్..
గత కొంతకాలం క్రితం పని గంటలపై కొందరి స్టేట్మెంట్లు తీవ్ర దుమారంలేపిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఒకరు వారనికి 90 గంటలు పనిచేయాలని చెబుతుండగా, మరొకరు 72 గంటలు చేయాలంటూ ఇలా చాల మంది ఈ చర్చల్లో పాల్గొనేలా చేసాయి. అయితే ఐటి సెక్టార్లో పని చేసే టెక్కీలకు వారికి 5 రోజులే వర్కింగ్ డేస్ ఉండగా, కొందరు వీకెండ్లో ఇంట్లో ఉండి ఎం చేస్తారు ఆఫీస్ వచ్చి పని చేయండి అంటూ ఉద్యోగులను కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మధ్య ప్రస్తుతం బెంగళూరు సీఈఓ చేసిన పోస్ట్ అందరిని ఆలోచించేలా చేసింది, అంతేకాదు ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈఓ బిపి 230కి పెరిగి ఐసియులో చేరడానికిగల కారణాలను లింక్డ్ఇన్‌లో షేర్ చేసాడు. ఇందులో పని కంటే ముందు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. అంతేకాదు పని కోసం ఎప్పుడూ ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదని తీవ్రంగా గుర్తు చేశారు.
Dazeinfo మీడియా అండ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు అండ్ CEO అయిన అమిత్ మిశ్రా, లింక్డ్ఇన్‌లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్‌లో తనకు ఎదురైన దిగ్భ్రాంతికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ఒకవైపు ల్యాప్‌టాప్‌పై పని చేస్తుండగా మరోవైపు తన ముక్కు నుండి రక్తం కారుతుండటంతో ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. అకస్మాత్తుగా ముక్కు నుండి ఆగకుండా రక్తం కారడం, కోమాలోకి వెళ్తామేమోనని భయపడి ఐసియులో చేరడం ఇదంతా ఒక భయంకరమైన వారాంతం అని చెప్పుకొచ్చాడు.
"నన్ను అపోలో ఆసుపత్రికి తరలించే సమయానికి, నా రక్తం చాలా వరకు పోయింది. ఎమర్జెన్సీ టీం 20 నిమిషాలు కష్టపడి రక్తస్రావం ఆపేసింది. కానీ అప్పుడే నిజమైన షాక్ తగిలింది. నా బిపి 230కి చేరింది. తలనొప్పి, తలతిరగడం, ఎలాంటి స్పర్శ లేదు, బిపి కూడా చూపించడం లేదు, అయితే బిపి ప్రమాదకర స్థాయికి పెరిగిందని వైద్యులు తెలుసుకోని, అతన్ని ఐసియులో చేర్చారు.
ఐసియులో డాక్టర్లు నా బిపిని సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసి నార్మల్ పరిస్థితికి తీసుకురాగా, తరువాత రోజు ఉదయం నేను ఐసియులో నడవడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. ఈసారి నా బిపి డౌన్ అయ్యింది, డాక్టర్లు మళ్ళీ అయోమయంలో పడ్డారు, తర్వాత నాలుగు రోజుల పాటు అన్ని రకాల టెస్టులు జరిగాయి. కానీ ఆశ్చర్యకరంగా ప్రతిదీ నార్మల్'గానే వచ్చింది. గతంలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేని మిశ్రా ఈ అనుభవాన్ని ఊహించని మలువుగా అభివర్ణించారు. నా బిపి ఇంత ఎక్కువగా ఎలా పెరిగి అకస్మాత్తుగా ఎలా పడిపోయింది అని ఆశ్చర్యపోయాడు. నేను ఇంకా చికిత్సలో ఉండగా మరికొన్ని టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ అనుభవం నాకు కొన్ని జీవిత పాఠాలను నేర్పింది అని ఆయన అన్నారు.
తన పరిస్థితి గురించి చెబుతూ ఇతరులు దీని నుండి చాలా నేర్చుకోవాలని కోరారు. అలాగే ఆరోగ్యనికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదొక సెకండ్ ఛాన్స్ అని, మీ శరీరం చెప్పేది వినండి నా లాంటి మేల్కొలుపు కాల్ కోసం వేచి ఉండకండి అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అతని పోస్ట్ సోషల్ మీడియా యూజర్లలో వర్క్ -లైఫ్ బ్యాలెస్ గురించి చర్చకు దారితీసింది. అలాగే దీనిపై ఎంతో మంది ఉద్యోగం ఇంకా ఆరోగ్యం పై రకరకాల కామెంట్లు చేసారు.


Click it and Unblock the Notifications