దక్షిణ భారతదేశంలోని రెండు అతిపెద్ద మెట్రో నగరాలైన బెంగళూరు (Bengaluru) ,చెన్నై (Chennai) మధ్య ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన వార్త చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే' పనులు చివరి దశకు చేరుకున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఇటీవల జరిగిన 'బిల్డ్ ఇండియా ఇన్‌ఫ్రా అవార్డ్స్' మూడవ ఎడిషన్ లో మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

260 కిలోమీటర్లు.. కేవలం 2 గంటల్లో!
సాధారణంగా బెంగళూరు (Bengaluru) నుంచి చెన్నైకి వెళ్లాలంటే ట్రాఫిక్ , ప్రస్తుతం ఉన్న రహదారుల ద్వారా కనీసం 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. కానీ, ఈ కొత్త 260 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే.. ఈ దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ఇంధన పొదుపుకు , కాలుష్య నివారణకు కూడా ఎంతో దోహదపడుతుంది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణం ఎలాగైతే రెండు గంటలకు తగ్గిందో అదే తరహాలో దక్షిణ భారత్‌లో కూడా ఈ మార్పు రాబోతోంది.
పర్యావరణ హిత రహదారులు .. టన్నెల్స్..
కేవలం ప్రయాణ సమయం తగ్గించడమే కాకుండా పర్యావరణానికి హాని కలగకుండా రహదారులను నిర్మించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా టన్నెల్స్ (సొరంగాలు) నిర్మాణంలో భారత్ కు ఉన్న సామర్థ్యాన్ని గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఢిల్లీ, చెన్నై మధ్య దూరాన్ని కూడా సుమారు 320 కిలోమీటర్ల మేర తగ్గించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల ఉత్తర భారతం , దక్షిణ భారతం మధ్య కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది.
హైడ్రోజన్ ఫ్యూయల్ , కొత్త టెక్నాలజీ
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్ రహిత ప్రయాణంపై కేంద్రం మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఫ్యూయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రయోగాలు చేస్తోంది. పది ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం అంతర్జాతీయ సంస్థలతో కలిసి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. అలాగే, రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించని లేదా అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రాల సహకారంతో జాతీయ ప్రమాణాలు
రాష్ట్రాల్లో నిర్మించే రోడ్లు కూడా జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఒక కొత్త పాలసీని రూపొందిస్తోంది. ఇది రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది. బెంగళూరు (Bengaluru) వంటి ఐటీ హబ్స్ నుంచి ఇతర పొరుగు దేశాలకు కనెక్టివిటీ పెంచేలా వ్యూహాత్మక రహదారులను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వ్యాపార, వాణిజ్య రంగాలు మరింత పుంజుకుంటాయని, ముఖ్యంగా లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆశిస్తున్నారు.
మొత్తానికి ఈ ఏడాది చివరి కల్లా బెంగళూరు నుంచి - చెన్నై ప్రయాణం విమానం కంటే వేగంగా అనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ఎకో-ఫ్రెండ్లీ రోడ్లు మన దేశ రవాణా ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయి.
More From GoodReturns

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications