మన దేశంలో రైల్వే వ్యవస్థ రూపురేఖలు మారిపోతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని రెండు ప్రధాన నగరాలైన బెంగళూరు (Bengaluru) , చెన్నై మధ్య ప్రయాణించే వారికి ఒక అద్భుతమైన వార్త అందుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బెంగళూరు-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్లానింగ్ దశ నుంచి అమలు దశకు అడుగులు వేస్తోంది. కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఏడు హై-స్పీడ్ రైల్ కారిడార్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.

రూట్ ఖరారు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఇప్పటికే ఈ 306 కిలోమీటర్ల కారిడార్‌కు సంబంధించిన సర్వేను పూర్తి చేసింది. ఈ బుల్లెట్ ట్రైన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ప్రధానంగా బెంగళూరు నగరాన్ని చెన్నైతో అనుసంధానిస్తూ మధ్యలో కీలక ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ మార్గంలో చెన్నై సెంట్రల్, పూనమల్లి, పరందూర్ (తమిళనాడు), చిత్తూరు సమీపంలోని రామపురం (ఆంధ్రప్రదేశ్), కోలార్ సమీపంలోని హుడుకుల, హోస్కోట్ సమీపంలోని కోడిహళ్లి, , బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, బైయప్పనహళ్లి స్టేషన్లను ప్రతిపాదించారు.
ప్రయాణ సమయం భారీగా తగ్గింపు
ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు లేదా రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే కనీసం 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. కానీ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే, గరిష్టంగా గంటా 13 నిమిషాల్లోనే మీరు గమ్యాన్ని చేరుకోవచ్చు. ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. సగటున 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా, ప్రయాణికులకు చాలా సమయం ఆదా అవుతుంది.
భూగర్భ స్టేషన్లు , సొరంగాలు
బెంగళూరు వంటి రద్దీ నగరాల్లో భూసేకరణ సమస్యలు లేకుండా ఉండేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైట్‌ఫీల్డ్ , బైయప్పనహళ్లి మధ్య దాదాపు 12 కిలోమీటర్ల మేర రైలు భూగర్భంలో (Underground) ప్రయాణించనుంది. అలాగే చెన్నై నగరంలో 2.5 కి.మీ, చిత్తూరు సమీపంలోని మొగిలి ఘాట్ సెక్షన్ వద్ద 11.5 కి.మీ మేర సొరంగాలు నిర్మించనున్నారు. దీనివల్ల పర్యావరణానికి , నగర నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బంది కలగదు.
భవిష్యత్తు ప్రణాళికలు
కేవలం చెన్నై మాత్రమే కాకుండా, బెంగళూరు నుండి హైదరాబాద్‌కు కూడా బుల్లెట్ ట్రైన్ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల హైదరాబాద్ ప్రయాణం కూడా కేవలం రెండు గంటల్లోనే ముగిసిపోతుంది. మైసూర్ కారిడార్‌ను రెండో దశలో చేపట్టనున్నారు. మొత్తం మీద రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడితో సాగుతున్న ఈ మెగా ప్రాజెక్టులు భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయి. త్వరలోనే పనులు పూర్తి చేసి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications