నేటి కాలంలో నెలకు లక్షల్లో జీతం వచ్చినా నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదని బాధపడేవారు చాలా మంది ఉంటారు. కానీ, బెంగళూరు (Bengaluru) నగరంలో ఒక సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, నేడు ఉన్నత స్థితిలో ఉన్న మీనల్ గోయెల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పంచుకున్న తన జీవిత అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొదుపు అనేది కేవలం పిసినారితనం కాదని, అది ఒక క్రమశిక్షణ అని ఆమె నిరూపించారు.

జీతం రూ. 20,000.. ఆటో ఛార్జీ రూ. 60..
మీనల్ తనకు 22 ఏళ్ల వయసులో బెంగళూరు (Bengaluru) లో తన మొదటి ఉద్యోగంలో చేరినప్పుడు ఆమె జీతం నెలకు కేవలం రూ. 20,000 మాత్రమే. ఇంటి అద్దె, తిండి, ఇతర కరెంటు బిల్లులు అన్నీ పోగా ఆమె చేతిలో మిగిలేది కేవలం రూ. 3,000 మాత్రమే. ఆ సమయంలో ఆఫీసుకి వెళ్లడానికి ఆటో ఎక్కితే రూ. 60 ఖర్చయ్యేది. "కేవలం 60 రూపాయలే కదా" అని చాలా మంది అనవచ్చు. కానీ, ఒక సీఏగా ఆమె వేసిన లెక్క అందరినీ ఆశ్చర్యపరిచింది.
మీనల్ వేసిన ఆ 'సేవింగ్స్' లెక్క ఏంటంటే?
రోజుకు రూ. 60 చొప్పున, నెలకు 26 పనిదినాలకు కలిపి రూ. 1,560 అవుతుంది. ఆమె మిగిల్చే రూ. 3,000 మొత్తంలో ఈ రూ. 1,560 అనేది దాదాపు 31 శాతం! అంటే తన పొదుపులో మూడో వంతు కేవలం ప్రయాణానికే ఖర్చు చేయడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఎండనక, వాననక వరుసగా మూడు నెలల పాటు రోజుకు 4 కిలోమీటర్లు నడిచి ఆఫీసుకి వెళ్ళేవారు.
కష్టం వెనుక ఉన్న అసలు కారణం
నిజానికి మీనల్ తల్లిదండ్రులు ఆర్థికంగా నిలకడగా ఉన్నవారే. ఆమెకు డబ్బులు కావాలని అడిగితే వెంటనే పంపేవారు. కానీ, 20 ఏళ్ల వయసులోనే "ఇకపై నా కాళ్ల మీద నేను నిలబడాలి, తల్లిదండ్రులపై ఆధారపడకూడదు" అని ఆమె ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మనిర్భరత కోసం ఆమె పడ్డ ఆ కష్టం కేవలం డబ్బు కోసమే కాదు, తన మీద తనకు నమ్మకం పెంచుకోవడానికి కూడా.
మనం నేర్చుకోవాల్సిన పాఠం
డెలోయిట్ (Deloitte), కేపీఎమ్‌జీ (KPMG) వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న మీనల్, తన జీవితంలో ఆ 4 కిలోమీటర్ల నడక నేర్పిన పాఠం ఏ బిజినెస్ పుస్తకం నేర్పలేదని చెబుతారు. కష్టాలు మనిషికి క్రమశిక్షణను, మానసిక స్థైర్యాన్ని ఇస్తాయని ఆమె నమ్ముతారు. బెంగళూరు (Bengaluru) లాంటి ఖరీదైన నగరంలో మధ్యతరగతి యువతకు ఆమె ఒక గొప్ప ఇన్సిపిరేషన్.
ఏది ఏమైనా నేటి తరం యువత చిన్న చిన్న ఖర్చులను పట్టించుకోకుండా క్రెడిట్ కార్డుల ఉచ్చులో పడుతున్న వేళ, మీనల్ గోయెల్ చెప్పిన ఈ 'మనీ మేనేజ్‌మెంట్' సూత్రం అందరికీ కనువిప్పు కలిగిస్తోంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే ఆర్థిక క్రమశిక్షణతోపాటు క్యారెక్టర్ బిల్డ్ అవుతుందని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications