Narayana Murthy: ఇన్ఫోసిస్ మూర్తి వ్యాఖ్యలపై డాక్టర్ ట్వీట్.. నిజమే అంటున్న నెటిజన్లు..!!
Narayana Murthy: ఇన్ఫోసిస్ కంపెనీని విజయవంతగా నడిపిన బిలియనీర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి. తాజాగా ఆయన పాల్గొన్న ఒక చర్చలో కీలకమైన కామెంట్స్ చేశారు.
యువ టెక్కీలు వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి. అనేక మంది స్టార్టప్ వ్యవస్థాపకులు, కొందరు బిజినెస్ కమ్యూనిటీలోని వ్యక్తులు మూర్తి చెప్పింది నిజమే అంటూ సమర్థిస్తున్నారు. ఇదే క్రమంలో టెక్కీల నుంచి దీనిపై తీవ్ర విమర్శలు సైతం ఎదురవుతున్నాయి. నెట్టింట్లో మీమ్స్, షార్ట్ వీడియోలో సైతం కొంత మంది చేసేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ గుండె డాక్టర్ దీనిపై స్పందించారు.

బెంగళూరుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఇన్ఫోసిస్ నారాణయమూర్తి వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. ప్రతి మనిషికి రోజుకు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంటుందని తాను నమ్ముతానని తన ట్వీట్ లో వెల్లడించారు. వారానికి ఎవరైనా 6 రోజులు పనిచేసినట్లయితే రోజుకు 12 గంటలు వృత్తి కోసం వెచ్చిస్తున్నట్లని అన్నారు.
ఇక మనకు మిగిలేది 12 గంటలు మాత్రమే. ఇందులో 8 గంటలు నిద్రకు, నాలుగు గంటలు మిగిలిన రోజువారీ పనులకు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. బెంగళూరు మహానగరంలో నివశించే ప్రజలు మిగిలిన నాలుగు గంటల సమయంలో రెండు గంటలు ట్రాఫిక్ పైనే గడుపుతారన్నారు. ఇక అందరికీ మిగిలేది 2 గంటలు.. ఇందులోనే కాళ్లకృత్యాలు, తినటం వంటి ఇతర పనులు ఉంటాయని పేర్కొన్నారు.
డాక్టర్ చెప్పిన వివరాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో వ్యక్తులకు కుటుంబంతో గడిపేందుకు, సోషలైజ్ అయ్యేందుకు, వినోదానికి, వ్యాయామం చేసేందుకు అస్సలు సమయం ఉండటం లేదని చెప్పారు. ఇంత ఒత్తిడితో కొనసాగుతున్న జీవితాల వల్లే ఎక్కువ మందికి చిన్న వయస్సులోనే గుండె పోటు సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తున్న చాలా మంది డాక్టర్ చెప్పిన దానిలో వాస్తవం ఉందని అభిప్రాయపడుతున్నారు. తక్కువ పనిగంటలతో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించటం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రజలు ఆశ్వాధించొచ్చని డాక్టర్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications