ఆఫీస్‌లో తక్కువ చేసి చూశారని 3 నెలల స్టైపెండ్‌తో ఐఫోన్ కొన్నది! చివరకు ఆమె ఏం గ్రహించిందంటే?

కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతలో చాలామంది పక్కవారిని చూసి, ఆఫీస్ కల్చర్‌కు అలవాటు పడాలనే ప్రెజర్‌తో అనవసరమైన ఖర్చులు చేస్తుంటారు. బ్రాండెడ్ బట్టలు, ప్రీమియం గ్యాడ్జెట్లు కొంటూ చేతులు కాల్చుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఒక రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేస్తూ.. బెంగళూరు (Bengaluru) కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (CA), మాజీ కేపీఎమ్‌జీ (KPMG) ఉద్యోగి అయిన మీనల్ గోయల్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తాను కేపీఎమ్‌జీ కంపెనీలో చేరిన కొత్తలో తోటి ఉద్యోగులందరూ ఇంటర్నేషనల్ ట్రిప్స్, లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి మాట్లాడుతుంటే తనకు చాలా తక్కువగా అనిపించేదని ఆమె చెప్పారు. తాను అంతకుముందు ఢిల్లీ దాటి ఎక్కడికీ వెళ్లకపోవడంతో, ఆ రిచ్ కల్చర్‌లో ఇమడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ (న్యూనతా భావం) వల్లే కేవలం ఆఫీస్‌లో అందరితో సమానంగా కనిపించడానికి, ఒక రకమైన 'షోఆఫ్' కోసమే తాను మొదటిసారి ఐఫోన్ కొనాలని డిసైడ్ అయినట్లు మీనల్ ఓపెన్‌గా ఒప్పుకున్నారు.

Bengaluru CA Shares Smart Double Investment Rule For Every Luxury Purchase

3 నెలల స్టైపెండ్ ఒకే ఒక్క ఫోన్‌కు!

ఆమె నిర్ణయాన్ని చూసి వాళ్ల నాన్న ఆశ్చర్యపోయారు. కేవలం ఒక ఫోన్ కోసం నీ 3 నెలల స్టైపెండ్ అమౌంట్‌ను ఖర్చు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. అయినా సరే, ఆమె వెనక్కి తగ్గకుండా ఐఫోన్ 12 కొనేశారు. అయితే ఫైనాన్స్ ఫీల్డ్‌లో ఉండి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వింతగా అనిపించినా, ఆ ఫోన్ చేతికి వచ్చాక ఆఫీస్‌లో తన టీమ్‌తో మాట్లాడేటప్పుడు తెలియని కాన్ఫిడెన్స్ వచ్చిందని, మానసికంగా తానూ అందరితో సమానమే అనే ఫీలింగ్ కలిగిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో ఆ ఎన్విరాన్‌మెంట్‌లో సర్వైవ్ అవ్వడానికి ఆ డెసిషన్ తనకు హెల్ప్ అయిందని, అందుకే ఆ ఖర్చు విషయంలో తనకు ఎలాంటి రిగ్రెట్ (బాధ) లేదని ఆమె అన్నారు.

లగ్జరీ వస్తువులు కొనడానికి మీనల్ కొత్త రూల్స్

కాలక్రమేణా డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే విషయంలో మీనల్ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. అప్పట్లో ఎమోషనల్ అయి ఐఫోన్ కొన్న ఆమె, ఇప్పుడు మాత్రం ఎలాంటి లగ్జరీ లేదా ఖరీదైన వస్తువులు కొనాలన్నా ఒక పక్కా ప్లానింగ్ ఫాలో అవుతున్నారు. అందులో ముఖ్యమైన రూల్స్ ఇవే:

  1. డబుల్ ఇన్వెస్ట్‌మెంట్ రూల్ (ఇన్వెస్ట్ ట్వైస్ ది అమౌంట్): ఇప్పుడు మీనల్ ఫాలో అవుతున్న మోస్ట్ పవర్‌ఫుల్ రూల్ ఇది. మనం ఏదైనా లగ్జరీ లేదా అనవసరమైన వస్తువు కొనాలనుకుంటే, ఆ వస్తువు ధర కంటే రెండు రెట్లు ఎక్కువ మొత్తాన్ని ముందుగా స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఉదాహరణకు, మీరు ₹5,000 విలువైన బ్రాండెడ్ స్నీకర్స్ (షూస్) కొనాలనుకుంటే, ముందుగా ₹10,000 తీసుకొని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాతే ఆ షూస్ కొనాలి. దీనివల్ల ఎలాంటి గిల్ట్ (తప్పు చేశామనే భావన) లేకుండా షాపింగ్ చేయవచ్చని ఆమె అంటారు.
  2. సెల్ఫ్ అవేర్‌నెస్ (ఆత్మపరిశీలన): ఏదైనా వస్తువు కొనే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ కొనుగోలు నిజంగా నా పర్సనల్ గ్రోత్‌కి ఉపయోగపడుతుందా? లేక కేవలం ఆ క్షణంలో కలిగిన ఎమోషన్ లేదా షోఆఫ్ కోసం దీన్ని సమర్థించుకుంటున్నానా? అని ఆలోచించాలి. "ఈ వస్తువు నాకు నిజంగా హెల్ప్ అవుతుందా?" అనే క్లారిటీ వస్తేనే ముందడుగు వేయాలని మీనల్ గోయల్ యువతకు సలహా ఇస్తున్నారు.

పెరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేసే యువతకు, ముఖ్యంగా బెంగళూరు లాంటి మెట్రో సిటీలలో ఉండే ఐటీ ఉద్యోగులకు ఈ సీఏ చెప్పిన ఫైనాన్షియల్ టిప్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+