సిలికాన్ సిటీ బెంగళూరులో ఉద్యోగం అంటేనే అందరూ ఎగిరి గంతేస్తారు. అయితే అలాంటి నగరంలొ ఉద్యోగం చేస్తూ ఒంటరతనాన్ని చాలామంది అనుభవిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తరువాత తన జీవితం చీకటిలోకి వెళ్లిపోయిందంటూ రెడ్డిట్ వేదికగా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా పేరు చెప్పని ఓ టెకీ యువతి @Confident-Floor-2943) ఐడీతో తన మనసులోని ఆవేదనను పంచుకుంది. ఆమె పోస్టు చదివిన చాలామంది కన్నీరు కార్చగా మరికొందరు మా పరిస్థితి కూడా అదేనని చెప్పుకొచ్చారు. ఇది నగర జీవన శైలిని మళ్లీ తెరపైకి తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు.
ఆ యువ సాఫ్ట్ వేర్ పెట్టిన పోస్ట్ ప్రకారం.. ఆమె ప్రయాణం బెంగళూరు నగరంలో ఇంటర్న్‌షిప్‌తో మొదలైంది. ఆ తర్వాత ఫుల్-టైమ్ ఆఫర్ రావడంతో తన జీవితంలో గొప్ప విజయాన్ని సాధించినట్లుగా ఫీల్ అయింది. అయితే ఆ విజయమే తన వ్యక్తిగత జీవితానికి శత్రువులా మారిందని ఆమె ఫీలవుతూ పోస్ట్ పెట్టింది.
ఈ ఉద్యోగం తర్వాత ఆమె ఒంటరిదైపోయింది. స్నేహితులు, కుటుంబం ఇలా అందరిన వదిలి నగరంలో ఒంటరి జీవనం గడుపుతోంది. ఆమె నివసించే పీజీ గది చల్లని గోడలతో, నిశ్శబ్ద వాతావరణంతో నిండిపోయింది. ఆమె ఏడ్చినా, నవ్వినా, ఎవరూ గమనించరు. అందుకే నేను దెయ్యంలా ఉన్నానని ఆమె ఆవేదనతో తెలిపింది.

ఇక ఆఫీసులో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. పురుషాధిక్య టీంలో ఏకైక మహిళగా ఆమె నిలిచింది. ఆమెతో తన సహచరులు పెద్దగా మాటలు కలపరు. అదే సమయంలో జాయిన్ అయిన ఒక పురుష సహోద్యోగి ఎక్కువ చర్చల్లో.. పనులలో భాగస్వామ్యం అవుతున్నాడు. ఆమె పోస్టులో చెబుతూ.. నా బృందంలో అబ్బాయిలు నన్ను చిన్నచూపు చూస్తారు. చిన్న చిన్న విషయాల్లో కూడా నన్ను దాటేస్తారని తెలిపారు. ఇక సీనియర్ సిబ్బంది కంపెనీని వదిలి వెళ్లిపోవడంతో.. ఆమెకు మెంటర్‌షిప్ లేదా ప్రోత్సాహం దొరకడం లేదని వాపోతోంది.
చివరకి ఆమెకు పనికి వెలుపల కూడా ఒంటరితనం వెంటాడుతోంది. ఒకప్పుడు దగ్గరగా ఉన్న స్నేహితులు ఇప్పుడు వేరే ప్రాంతాలకు మారిపోయారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రహదారులు కిలోమీటర్లలో కాదు.. గంటల్లో లెక్కపెడతారని రాసుకొచ్చారు. అందువల్ల మిత్రులను కలవడం కష్టమవుతోంది. ఫలితంగా ఆమె రోజులు ఒంటరితనం తోనే సాగుతున్నాయి.

Bengaluru Techie Shares Heart-Wrenching Battle with Loneliness
నేను అరిచినా, ఏడ్చినా, వాళ్లకి పట్టదు. ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నానేమో అనిపిస్తోందని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ పోస్ట్‌కు రెడ్డిట్‌లో విశేషంగా స్పందన వచ్చింది. ఒక నెటిజన్ మాట్లాడుతూ.. నేను కూడా బెంగళూరులో 4 సంవత్సరాలుగా ఉన్నాను, అదే ఫీలింగ్. ఈ నగరం మనసు మెల్లగా ఖాళీ చేస్తుందని తెలిపాడు. మరొక నెటిజన్ ప్రతి ఒక్కరూ ఈ దశను ఎదుర్కొంటారు. యుక్తవయస్సులో ఇది కొత్త అనుభవం కాదు. కానీ దీన్ని జయించడానికి అలవాటు పడాలని వ్యాఖ్యానించారు.
కొందరు ఆమెను మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించగా మరికొందరు కొత్త సామాజిక సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి చిన్న ప్రయత్నాలు చేయమని, స్థానిక క్లబ్బులు లేదా ఆసక్తి గల గ్రూపుల్లో చేరమని సలహా ఇచ్చారు. ఈ కథ ఆమె ఒక్కరిదే కాదు..కుటుంబాలకు దూరంగా నగరంలో బతుకుతున్న వేలాది మంది కథ.


Click it and Unblock the Notifications