Freelancing: అదనపు ఆదాయం కోసం చూస్తున్నారా..? అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఓ లుక్కేయండి!
Freelancing: పెరుగుతున్న ఖర్చులను భరించాలంటే ఒక్క ఉద్యోగం చేస్తే చాలని పరిస్థితి ఏర్పడింది. అందుకే పలువురు ఉద్యోగులు అదనపు ఆదాయం సంపాదించే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాల కోసం చూస్తుంటారు. వీరే కాక ఇంటి వద్ద ఉండే గృహిణులు, విద్యార్థులు సైతం వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్.. ఈ తరహా వ్యక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఫ్రీలాన్సర్, అప్ వర్క్ వంటి పలు కంపెనీలు ఇప్పటికే గిగ్ వర్కర్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కాగా బెంగళూరుకు చెందిన క్లౌడ్ ఆధారిత ఫ్రీలాన్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టార్ట్-అప్ PoddL కూడా ఈ వ్యాపారంలోకి దిగింది. దేశంలోని ఫ్రీలాన్సర్‌లు మరియు రిమోట్ వర్కర్లు ప్రపంచవ్యాప్తంగా పని వెతుక్కునేందుకు, సజావుగా పేమెంట్స్ పొందేందుకు ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

PoddL అనేది మొదటి మైబైల్ ఆధారిత చాట్ బేస్ట్ ప్లాట్ ఫారమ్. పలు దేశాలకు చెందిన కంపెనీలు, వ్యక్తులతో కమ్యూనికేట్ అవుతూ వర్క్ ఫ్లో నిర్వవహించడానికి అనుమతిస్తుంది. అంతే కాక అంతర్జాతీయ చెల్లింపులను సైతం ఇందులో సులువుగా పొందవచ్చు. మొత్తం 135 కరెన్సీలను PoddL సపోర్ట్ చేస్తుంది. చాట్ ఇంటర్ ఫేస్ లోనే సురక్షితమైన కార్డ్ చెల్లింపు ఆప్షన్ సైతం ఉంటుంది.
ఇండియా ఫ్రీలాన్సింగ్ ఎకానమీ 29 శాతం CAGRతో ప్రస్తుతం వృద్ధి చెందుతోంది. తద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రామికశక్తి విభాగాల్లో ఒకటిగా నిలిచింది. అందుకే PoddL ఈ విభాగంపై దృష్టి సారించినట్లు చెబుతోంది. కాగా దీనిని iOS, అండ్రాయిడ్ డివైసెస్, వెబ్ యాప్ ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లక్ష గ్లోబల్ కంపెనీలు, వ్యాపారాలను ప్లాట్ ఫారమ్ లోకి ఆన్ బోర్డ్ చేయడమే లక్ష్యంగా ఈ స్టార్టప్ పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications