బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి తొలి, సెకెండ్ వేవ్ దేశాన్ని కుదేల్ చేశాయి. ఆర్థిక రంగాన్ని దెబ్బతీశాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రొఫెషనల్ ఉద్యోగులు.. తాము పనిచేసే కార్యాలయాల ముఖం చూడనివ్వకుండా చేసింది కరోనా మహమ్మారి. వర్క్ ఫ్రమ్ హోమ్ రూపంలో లక్షలాది మంది నిపుణులను నెలల తరబడి ఇళ్లకే పరిమితం చేసింది. ఫలితంగా- ఐటీ పార్కులన్నీ బోసిపోయి కనిపించాయి. వందలాది మంది ఉద్యోగులతో సందడిగా మారే అనేక కార్యాలయాలు కళ తప్పాయి.

తగ్గిన కరోనా తీవ్రత..
ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా వైరస్ తీవ్రత భారీగా తగ్గింది. రోజువారీ కరోనా వైరస్ కేసులు ఇవ్వాళ అతి తక్కువగా నమోదయ్యాయి. 30 వేలకు దిగువగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 28,591 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 338 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 34,848 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కి చేరింది. ఇందులో 3,24,09,345 మంది కోలుకున్నారు. 4,42,655 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,84,921గా నమోదైంది.

70 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్..
మరోవంక- వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. 70 కోట్ల మందికి పైగా కరోనా వైరస్‌ను నిర్మూలించే వ్యాక్సిన్లను వేసుకున్నారు. ఇందులో తొలిడోసు తీసుకున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచివున్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటోన్నాయి. సెకెండ్ వేవ్‌లో సంభవించిన సంక్షోభ పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నాయి. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నాయి.

కోలాహలంగా ఐటీ పార్కులు..
ఈ పరిణామాల మధ్య ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీలు మళ్లీ తెరచుకుంటోన్నాయి. దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పాటు బోసిపోయి కనిపించిన ఐటీ పార్కులు మళ్లీ కోలాహలంగా మారబోతున్నాయి. సిలికాన్ సిటీ బెంగళూరు ప్రధాన కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా తన కార్యకలాపాలను సాగిస్తోన్న సాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రో.. తన కార్యాలయాలను పునరుద్ధరించింది. సోమవారం నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు హాజరు కావాలని సూచించింది. 18 నెలల తరువాత విప్రో కార్యాలయాలు తెరచుకుంటోన్నాయి.

వారంలో రెండుసార్లు..
ఈ మేరకు విప్రో అధినేత రిషద్ ప్రేమ్‌జీ- కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ రేపటి నుంచి కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని సూచించారు. ఇక విప్రో ఉద్యోగులు, ఆ సంస్థలో పనిచేసే సాఫ్ట్‌వేర్ నిపుణులు రొటేషన్ పద్ధతిన.. వారంలో రెండు రోజుల పాటు కార్యాలయాలకు హాజరవుతారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి పాక్షికంగా బ్రేక పడినట్టే. వారంలో రెండు రోజుల పాటు కార్యాలయానికి వెళ్లడం, మిగిలిన రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని రిషద్ ప్రేమ్‌జీ చెప్పారు.
75 శాతం మంది వ్యాక్సినేటెడ్..
విప్రోలో పని చేసే దేశీయ ఉద్యోగుల్లో 75 శాతం మందికి పైగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 55 శాతం మంది ఉద్యోగులు ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అని రిషద్ ప్రేమ్‌జీ జులైలోనే ప్రకటించారు. ఈ రెండు నెలల వ్యవధిలో మరో 25 మంది ఉద్యోగులు వ్యాక్సిన్ డోసులను తీసుకుని ఉండొచ్చనే అంచనాలను వ్యక్తం చేస్తోన్నాయి మార్కెట్ వర్గాలు. ప్రతి ఉద్యోగి కూడా కరోనా ప్రొటొకాల్స్‌ను పాటించాల్సి ఉంటుందని రిషద్ ప్రేమ్‌జీ సూచించారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications