బెంగళూరులో ఆస్తి యజమానులకు సంబంధించిన పరిపాలనా వ్యవస్థలో మరో పెద్ద మార్పు చోటు చేసుకోబోతోంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం..బి-ఖాటా ఆస్తులు కలిగిన యజమానులు తమ ఆస్తులను ఎ-ఖాటాగా మార్చుకునే ముందు తప్పనిసరిగా ఇ-ఖాటా పొందాలి. నవంబర్ 1 నుండి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటికే ఆస్తి పత్రాల మార్పిడి ప్రక్రియను క్లిష్టంగా భావిస్తున్న అనేకమంది నివాసితులకు, ఈ కొత్త డిజిటల్ పొర మరింత గందరగోళాన్ని సృష్టించిందని వారు అంటున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం.. 21,527 చదరపు అడుగుల లోపు ఉన్న, ప్రజా రహదారుల వెంబడి ఉన్న బి-ఖాటా ఆస్తులు మాత్రమే ఎ-ఖాటాకు మార్పిడికి అర్హత పొందుతాయి. ఆస్తి యజమానులు భూమి మ్యుటేషన్, మ్యాప్ ఆమోదం వంటి ఇతర ఫీజులతో పాటు, ఆస్తి మార్గదర్శక విలువ ఆధారంగా 5 శాతం మార్పిడి రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఇప్పటికే రాజరాజేశ్వరినగర్ వంటి ప్రాంతాల్లో నివాసితులు నిరాశ వ్యక్తం చేశారు. ఎందుకంటే వారు తమ పత్రాలను ఎ-ఖాటా మార్పిడి కోసం సిద్ధం చేసుకుంటుండగా, కొత్త ఇ-ఖాటా నిబంధన అకస్మాత్తుగా అమల్లోకి రావడంతో, వారికి అదనపు ప్రక్రియను పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం Bengaluru లో సుమారు 7.5 లక్షల బి-ఖాటా ఆస్తులు ఉన్నట్లు అంచనా. వీటిలో ఇప్పటి వరకు కేవలం 2.6 లక్షల ఆస్తులు మాత్రమే ఇ-ఖాటాగా అప్‌గ్రేడ్ అయ్యాయి.
జోన్ వారీగా చూస్తే -
ఇందులో వెస్ట్ జోన్ 72,000 మార్పిడులతో అగ్రస్థానంలో ఉంది. నార్త్ జోన్ 69,000 మార్పిడులతో రెండో స్థానంలో ఉంది.ఈస్ట్ జోన్ 62,816 మార్పిడులతో మూడో స్థానంలో ఉంది. రాజరాజేశ్వరినగర్ జోన్‌లోనే అత్యధికంగా 1.23 లక్షల ఆస్తులు ఇ-ఖాటాకు మారాయి. తరువాత బెంగళూరు సౌత్, అనేకల్ జోన్‌లు 1.03 లక్షల మార్పిడులతో ఉన్నాయి.
ఈ మార్పును సమర్థిస్తూ, GBA స్పెషల్ కమిషనర్ (రెవెన్యూ) మునీష్ మౌద్గిల్ మాట్లాడుతూ, ఇ-ఖాటా అమలు పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థ వైపు తీసుకెళ్లే ముఖ్యమైన అడుగు అని తెలిపారు. ఆయన ప్రకారం ఈ దశ అపార్ట్‌మెంట్ నివాసితులకు వర్తించదు. ఇది కేవలం వ్యక్తిగత సైట్లు లేదా సైట్,భవన యజమానులకు మాత్రమే వర్తిస్తుందన్నారు.
ఒక సీనియర్ GBA అధికారి వివరించిన ప్రకారం.. ఈ చర్య వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఆస్తి పన్ను సమ్మతిని బలోపేతం చేయడంగా చెప్పుకొచ్చారు. అనేక బి-ఖాటా ఆస్తులకు సరైన పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం పన్ను ఆదాయాన్ని కోల్పోతోందని తెలిపారు. వాటిని ఎ-ఖాటా వ్యవస్థలో చేర్చడం ద్వారా నగర పన్ను బేస్ విస్తరిస్తుందని, ఆ పన్ను ఆదాయంతో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరుతాయని ఆయన పేర్కొన్నారు.
ఇ-ఖాటా తప్పనిసరి చేయడం వల్ల బెంగళూరు ఆస్తి మార్కెట్‌లో మరింత క్రమబద్ధత వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే అనేక దశల్లో నడిచే పత్రాల ప్రాసెస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆస్తి యజమానులు, ఈ కొత్త నిబంధన అమలుతో సమయం, ఖర్చు, సాంకేతిక చిక్కులు మరింత పెరగవచ్చని ఆందోళన చెందుతున్నారు.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications