Bengaluru ప్రస్తుతం తన రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) ఇప్పటికే తన డిజైన్ సామర్థ్యాన్ని మించి పనిచేస్తుండటంతో, రాబోయే దశాబ్దంలో ప్రయాణీకుల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుతున్న రద్దీని ఎదుర్కొనేందుకు, రాష్ట్ర ప్రభుత్వం మరో విమానాశ్రయం అవసరమని స్పష్టంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం దక్షిణ బెంగళూరును రెండవ విమానాశ్రయానికి అనుకూల ప్రాంతంగా భావిస్తోంది.
ప్రస్తుతం మూడు ప్రదేశాలు ప్రతిపాదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా కనకపుర రోడ్, బన్నెర్ఘట్ట రోడ్ కారిడార్లు అత్యంత అనుకూలంగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు ప్రాంతాలు మంచి రహదారి కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల పెరుగుదల, రియల్ ఎస్టేట్ అభివృద్ధి వంటి అంశాల వల్ల ముందంజలో ఉన్నాయి.దక్షిణ బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున ప్రయాణీకులు అంతర్జాతీయంగా ప్రయాణం చేస్తారని దీన్ని బేస్‌గా తీసుకుని, ఈ ప్రాంతంలో రెండవ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం తగినదిగా ప్రభుత్వం భావిస్తోంది.

అయితే ఈ ప్రతిపాదన సులభమైనది కాదు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఇప్పటికే ప్రతిపాదిత మూడు సైట్‌లపైనా పలు సాంకేతిక మరియు భౌగోళిక సవాళ్లను గుర్తించింది. వాయు మార్గ పరిమితులు, అటవీ ప్రాంతాలు, పర్వత భూభాగం కారణంగా కొన్ని సైట్‌లు అనుకూలంగా లేవని పేర్కొంది. అదనంగా, కొత్త విమానాశ్రయం కోసం అవసరమైన 10 వేల కోట్ల రూపాయల వ్యయం, 100-120 కి.మీ వ్యాసార్థంలో తగినంత పెద్ద భూమి లభ్యం కాకపోవడం కూడా ప్రధాన అడ్డంకిగా ఉంది.
మరోవైపు తమిళనాడు ప్రభుత్వం హోసూర్ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. ఈ హోసూర్ విమానాశ్రయం, దక్షిణ బెంగళూరు ప్రయాణీకులను లక్ష్యంగా పెట్టుకుని ప్రతిపాదించబడినందున కర్ణాటకకు ఇది పోటీ పరిస్థితిని సృష్టించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మౌలిక సదుపాయాల అభివృద్ధి విభాగం (IDD) అధికారులు సూచిస్తున్నారు.
IDDలోని ఒక అధికారి ప్రకారం.. ప్రస్తుతం KIA ద్వారా ప్రయాణించే సుమారు 85 మిలియన్ల మంది ప్రయాణీకులలో 40 మిలియన్లు దక్షిణ బెంగళూరు ప్రాంతం నుండి వస్తున్నారు.ఈ గణాంకాలు కొత్త విమానాశ్రయం అవసరాన్ని స్పష్టంగా చూపుతుందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ బెంగళూరులో కొత్త ఎయిర్‌పోర్ట్ లేకపోతే, ఆ ప్రాంతం నుంచి ప్రయాణించే ప్రజలు హోసూర్‌ను ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా ఎంచుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మౌలిక సదుపాయాల మంత్రి ఎంబి పాటిల్.. ప్రభుత్వం ఏ సైట్‌నే ఖరారు చేయలేదని, ఇది పూర్తిగా వివరణాత్మక సాధ్యాసాధ్యాల అధ్యయనం (Detailed Feasibility Study)పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ అధ్యయనాన్ని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ద్వారా నిర్వహించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లలో అనుభవం ఉన్న సంస్థలకు టెండర్ బిడ్డింగ్ కోసం బలమైన ప్రీ-క్వాలిఫికేషన్ షరతులు అమలు చేయనున్నామని ఆయన వెల్లడించారు.ఏ సైట్‌ను ఎంచుకోవాలో తుది నిర్ణయం నివేదిక సమర్పించిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. ఆ నివేదికను రాష్ట్ర కేబినెట్‌కి ఆమోదం కోసం సమర్పిస్తామని మంత్రి పాటిల్ చెప్పారు.
ఈ మొత్తం ప్రక్రియలో కర్ణాటక, తమిళనాడుల మధ్య విమానాశ్రయ పోటీ కొత్త మలుపు తీసుకునే అవకాశం ఉంది. హోసూర్ విమానాశ్రయ ప్రతిపాదన కర్ణాటకకు సవాల్‌గా నిలుస్తుండగా, దక్షిణ బెంగళూరులో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకోవడం రాష్ట్రానికి వ్యూహాత్మకంగా కీలకమవుతోంది.
More From GoodReturns

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Bengaluru: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో నరకం చూశాం: యుద్ధం మధ్య చిక్కుకున్న పీవీ సింధు ఎమోషనల్ పోస్ట్!

Bengaluru: క్యాబ్‌లోనే వంట, ఆఫీస్ వర్క్.. బెంగళూరు ట్రాఫిక్‌పై జర్మన్ యువతి జోకులు!

Bullet train: మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్! సౌత్ ఇండియాలో రాబోయే రూట్లు ఇవే..

Bengaluru: బెంగళూరు రియల్ ఎస్టేట్ 2026.. ఏ ఏరియాలో ధర ఎంత? పూర్తి వివరాలు!



Click it and Unblock the Notifications