Bengaluru News: కొడుకుని చంపేసిన సీఈవో తల్లి.. సుచనా సేథ్ హత్య రహస్యం ఇదే..

CEO Murdered Son: బెంగళూరుకు చెందిన ఒక ఏఐ స్టార్టప్ సీఈవోగా ఉన్న సుచనా సేథ్ దారుణానికి ఒడిగట్టింది. తన నాలుగేళ్ల కుమారుడిని కర్కశంగా చంపేయటం పెద్ద సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే నిందితురాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నిపుణురాలు. 39 ఏళ్ల సుచనా సేథ్ కేరళకు చెందిన వెంకట్ రామన్‌తో 2010లో వివాహం జరిగింది. 2019లో తల్లైన తర్వాత భర్తతో వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయి. ఆమె ప్రస్తుతం తన భర్త నుంచి విడాకుల కేసులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో వెంకట్ రామన్ కోరుకుంటే ప్రతి ఆదివారం తన కుమారుడిని కలవవచ్చని కోర్టు ఆదేశించింది. అయితే వెంకట్ తన కుమారుడిని చూడటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు.

 Bengaluru AI startup CEO Mother Suchana Seth Killed 4 years old son to take revenge on hubby

దీంతో ఆమెకు భర్తపై ఉన్న ద్వేషం తారా స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సుచనా తన కుమారుడిని గోవాలోని హోటల్‌లో హతమార్చింది. ఆమె హోటల్ చెక్‌అవుట్ తర్వాత రక్తపు మరకలు గుర్తించిన సిబ్బంది విషయం పోలీసులకు వెల్లడించారు. సీసీ కెమెరా వివరాల ప్రకారం ఆమె ఒక పెద్ద బ్యాగ్ తీసుకెళ్లిందని వెంట కుమారుడు లేడని వారు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేదుకు బెంగళూరుకు టాక్సీలో బయలుదేరిందని పోలీసులు తెలుసుకున్నారు. హోటల్ సిబ్బందితో విమానానికి బదులు ఖర్చు ఎక్కువైనా పర్లేదంటూ క్యాబ్ బుక్ చేయించింది.

వెంటనే గోవా పోలీసులు సదరు క్యాబ్ డ్రైవర్‌ను సంప్రదించారు. దీంతో సదరు డ్రైవర్ కారును చిత్రదుర్గలోని మంగళ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు విచారించగా బ్యాగులో చిన్నారి మృతదేహం లభ్యమైంది.ఇప్పుడు కోర్టు నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు సూచనా సేథ్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌కు తరలించి అరెస్ట్ చేసి గోవాకు తీసుకువస్తున్నారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ వివరాల ప్రకారం సూచనా సేథ్ 2020లో AI మైండ్‌ఫుల్ ల్యాబ్స్‌ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. విషయం ఇండోనేషియాలో ఉన్న నిందితురాలి భర్త వెంకట్ రామన్‌కు పోలీసులు వెల్లడించారు. ఆయనను వెంటనే ఇండియా రావాల్సిందిగా కోరారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+