అక్టోబర్ నెలలో బెంగళూరులో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నగరంలోని రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో సగటున రోజుకు 2,774 కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న ఈ మహానగరానికి, తాజా వాహనాలతో మరింత ఒత్తిడిని తెచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపిన రవాణా శాఖ డేటా ప్రకారం.. అక్టోబర్‌లో వాహన రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్‌తో పోలిస్తే 46 శాతం మేర పెరిగాయి. సెప్టెంబర్‌లో 56,831 వాహనాలు నమోదుకాగా, అక్టోబర్‌లో అది 86,014కు ఎగబాకింది. అంటే రోజువారీ సగటు రిజిస్ట్రేషన్లు 1,894 నుండి 2,774కి పెరిగాయి - ఇది ఇటీవల సంవత్సరాల్లో అత్యధిక నెలవారీ వృద్ధిగా చెప్పుకోవచ్చు.
Bengaluru లో ఈ పెరుగుదలలో ప్రధాన పాత్ర ద్విచక్ర వాహనాలదేనని చెప్పవచ్చు. ప్రతిరోజూ సుమారు 1,900 బైకులు, స్కూటర్లు రిజిస్టర్ అవుతున్నాయి. అదనంగా రోజుకి 514 కార్లు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులో నమోదైన వాహనాల మొత్తం సంఖ్య 1.2 కోట్లకు చేరుకుంది. ఇందులో 83.8 లక్షల ద్విచక్ర వాహనాలు, 24 లక్షల కార్లు ఉన్నాయి.

రవాణా శాఖ అధికారుల ప్రకారం.. అకస్మాత్తుగా వాహనాల అమ్మకాలు పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. పండుగ సీజన్ కొనుగోళ్లు, జీఎస్టీ తగ్గింపులు. సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్లు వాహన మార్కెట్‌ను ఊపేశాయి. 28 శాతం నుండి 18 శాతానికి తగ్గిన జీఎస్టీ రేట్లు ప్రధానంగా ఈ వాహనాల వర్తించాయి.350సీసీ వరకు ద్విచక్ర వాహనాలు అలాగే చిన్న పెట్రోల్ కార్లు (1,200cc కంటే తక్కువ, పొడవు 4 మీటర్లలోపు), చిన్న డీజిల్ కార్లు (1,500cc కంటే తక్కువ, పొడవు 4 మీటర్లలోపు) వాహనాలపై వర్తించాయి. తక్కువ పన్ను ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవడానికి చాలా మంది కొనుగోలుదారులు అక్టోబర్‌లో కొత్త వాహనాలు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
జీఎస్టీ తగ్గింపులు అమ్మకాలను పెంచడంతో రవాణా శాఖ ఆదాయానికి కూడా ఊతం లభించింది. అక్టోబర్ 2025లో శాఖ రూ.1,387 కోట్లు వసూలు చేసింది. ఇది 2024 అక్టోబర్‌లో వసూలైన రూ.1,157 కోట్ల కంటే రూ.230 కోట్లు ఎక్కువ. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు కార్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోలిస్తే 4,000 ఎక్కువగా నమోదయ్యాయి. రవాణా కమిషనర్ యోగేష్ ఏ.ఎం. మాట్లాడుతూ..తగ్గిన పన్నులు ప్రజలకు ప్రోత్సాహం ఇచ్చాయి. పండుగ సీజన్‌లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో వాహనాల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయని అన్నారు.
రవాణా శాఖ రాష్ట్ర ఆదాయానికి కీలక విభాగంగా నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.15,000 కోట్లు వసూలు చేయాలని శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అధికారులు దీన్ని సాధ్యమని విశ్వసిస్తున్నారు. ఎందుకంటే పన్ను తగ్గింపులు, మౌలిక వసతుల మెరుగుదల, పండుగ సీజన్ సెంటిమెంట్ అన్నీ బలమైన అంశాలుగా నిలుస్తున్నాయి. ఏదేమైనా అక్టోబర్‌లో బెంగళూరులో నమోదైన 86,000 వాహనాలు నగర వాహన మార్కెట్ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే అదే సమయంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం, పార్కింగ్ సమస్యలపై అధికారులకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications