భారతదేశ సిలికాన్ వ్యాలీగా, టెక్నాలజీ హబ్ గా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) నగరం ఇప్పుడు మరో అంతర్జాతీయ గుర్తింపును పొందింది. అయితే ఇది గర్వపడాల్సిన విషయం కాదు.. ఆందోళన చెందాల్సిన విషయం. తాజా 'టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్' (TomTom Traffic Index 2025) ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. మెక్సికో సిటీ మొదటి స్థానంలో ఉండగా, మన బెంగళూరు దాని తరువాతి స్థానాన్ని ఆక్రమించింది.

గణనీయంగా పెరుగుతున్న రద్దీ
గత మూడేళ్లలో బెంగళూరు ట్రాఫిక్ గ్రాఫ్ చూస్తే భయం వేయక మానదు. 2023లో ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో ఉన్న నగరం, 2024లో 3వ స్థానానికి, ఇప్పుడు ఏకంగా 2వ స్థానానికి చేరుకుంది. ప్రభుత్వం బెంగళూరును "సిటీ ఆఫ్ ది ఫ్యూచర్" అని పిలుస్తున్నా, రోడ్లపై గంటల తరబడి చిక్కుకుపోయే సామాన్యుడికి మాత్రం అది 'ట్రాఫిక్ నరకం'లానే కనిపిస్తోంది.
10 కి.మీ ప్రయాణానికి 36 నిమిషాలు!
ఒకప్పుడు బెంగళూరులో ప్రయాణం అంటే ఆహ్లాదంగా ఉండేది. కానీ 2025 నాటి గణాంకాల ప్రకారం:
- సగటు వేగం: రద్దీ సమయాల్లో (Rush Hour) వాహనాల సగటు వేగం కేవలం 13.9 కి.మీ/గం మాత్రమే. అంటే సైకిల్ తొక్కే వేగం కంటే కొంచెం ఎక్కువ అంతే!
- ప్రయాణ సమయం: కేవలం 10 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి ఇప్పుడు సగటున 36 నిమిషాల 9 సెకన్లు పడుతోంది. 2024తో పోలిస్తే ఇది రెండు నిమిషాలు పెరిగింది.
ఏడాదిలో 7 రోజులు వృధా!
ఈ నివేదికలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఒక సగటు బెంగళూరు వాసి ఏడాదికి సుమారు 168 గంటల సమయాన్ని కేవలం ట్రాఫిక్‌లోనే గడుపుతున్నాడు. 168 గంటలు అంటే.. అక్షరాలా 7 పూర్తి రోజులు. అంటే ప్రతి సంవత్సరం మీరు మీ జీవితంలోని ఒక వారాన్ని కేవలం రోడ్డుపై వాహనాల మధ్య పొగ చూస్తూ గడిపేస్తున్నారన్నమాట. ఇది కేవలం సమయం వృధా మాత్రమే కాదు, మానసిక ఒత్తిడికి, ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తోంది.
2025 లో అత్యంత దారుణమైన రోజు ఏదో తెలుసా?
గత ఏడాది మే 17 (శనివారం) బెంగళూరులో అత్యంత దారుణమైన ట్రాఫిక్ రోజుగా నమోదైంది. వర్షం, కూలిన చెట్లు, మౌలిక సదుపాయాల లోపం వల్ల ఆ రోజు రద్దీ 101% కి చేరింది. సాయంత్రం సమయంలో కేవలం 2.5 కిలోమీటర్లు వెళ్లడానికి వాహనదారులకు 15 నిమిషాల సమయం పట్టింది.
మన దేశంలోని ఇతర నగరాలు ఎలా ఉన్నాయి?
ప్రపంచంలోని టాప్-20 ట్రాఫిక్ నగరాల్లో బెంగళూరు (2వ స్థానం) తర్వాత పూణే (5వ స్థానం), ముంబై (18వ స్థానం) కూడా ఉన్నాయి. అయినప్పటికీ, పూణే (18 కి.మీ/గం), ముంబై (20.8 కి.మీ/గం) లలో వాహనాలు బెంగళూరు కంటే వేగంగానే కదులుతున్నాయి.
ఎందుకీ దుస్థితి?
దీనికి ప్రధాన కారణాలు వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, రోడ్ల విస్తరణ జరగకపోవడం మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు (మెట్రో వంటివి) ఆలస్యం కావడం. బెంగళూరు (Bengaluru) బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతున్నా, రోడ్లపై మాత్రం నగరం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇది కేవలం పౌర సమస్య మాత్రమే కాదు, సామాన్యుడి జీవన ప్రమాణాల అత్యవసర పరిస్థితిగా మారుతోంది.
More From GoodReturns

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications