బెంగళూరు మహిళకు వింత అనుభవం.. జాబ్ ఇవ్వకపోవడానికి కంపెనీ చెప్పిన కారణం వింటే..
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల జాబ్ మార్కెట్ అధ్వానంగా తయారయింది. కంపెనీలు సైతం రిక్రూట్మెంట్ పట్ల అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఆన్ బోర్డ్ కావలసిన వారికి కూడా ఏవో కుంటి సాకులు చెబుతూ జాయినింగ్ ఆలస్యం చేయడం లేదా రిజెక్ట్ చేస్తున్నాయి. కొన్నిసార్లు ఆయా సంస్థలు చెప్పే కారణాలు చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి.
తాజాగా బెంగళూరుకు చెందిన ప్రతీక్ష జిచ్కర్ కు వింత అనుభవం ఎదురైంది. ఉద్యోగం కోసం ఓ కంపెనీలో పలు రౌండ్ల ఇంటర్వ్యూలకు అటెండ్ అయింది. ఇక జాబ్ కన్ఫమ్ అనుకుంటున్న తరుణంలో కంపెనీ నుంచి సెలెక్ట్ కాలేదని మెయిల్ వచ్చింది. అందుకు కారణం సైతం అందులో పేర్కొంది. దీనిని చూసి సదరు మహిళ ఒక్కసారిగా ఆమె షాక్ అయింది. స్కిన్ టోన్ ఫెయిర్గా ఉందన్న కారణంగా ఆమెకు జాబ్ ఆఫర్ చేయలేమని కంపెనీ మెయిల్ చేసింది.

ఆ మెయిల్ స్క్రీన్ షాట్‌ను ప్రతీక్ష లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేయడంతో మ్యాటర్ బయటకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో దూసుకుపోతున్న ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ.. వివక్ష మాత్రం ఇంకా వెళ్లూనుకుని ఉన్నట్లు అభిప్రాయపడింది. అయితే కంపెనీ పేరును మాత్రం వెల్లించలేదు. సమాన అవకాశాలు, వివక్ష రహిత నియామకాలు పేరిట కంపెనీలు ఈ తరహా చర్యలకు దిగకూడదనే తాను ఈ పోస్ట్ చేసినట్లు వెల్లడించింది.
ఆమె చేసిన పోస్ట్ పై పలువురు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఏ కంపెనీ కూడా తిరస్కరించడానికి కారణాన్ని వెల్లడించరని చెబుతున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొందరు, తగిన అర్హతలు లేకపోడం వల్ల రిజెక్ట్ చేయడం చూశాం కానీ ఫెయిర్ గా ఉన్నందుకు తిరస్కరించినట్లు వినడం ఇదే మొదటి సారి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె లింక్డ్ ఇన్ కామెంట్స్ డిసేబుల్ చేసినట్లు తెలుస్తోంది. ట్విట్టర్, రెడ్డిట్ లో ఇది కాస్తా వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications