Bengaluru: ట్రాఫిక్, అద్దెలు, తిండి.. బెంగళూరు కష్టాలకు చెక్ పెట్టే 30 డేస్ రోడ్‌మ్యాప్! వీడియో వైరల్!
ఉద్యోగ అవకాశాల కోసం ఏటా వేలాది మంది యువత బెంగ

మొదటి వారం: నివాసం , పరిసరాల అవగాహన
బెంగళూరులో అడుగుపెట్టిన మొదటి వారం చాలా కీలకమని ప్రియాంక పేర్కొన్నారు. మొదట ఆఫీసుకు దగ్గరగా ఉండే ఏరియాలో అద్దెకు ఇల్లు లేదా పీజీ (PG) వెతుక్కోవడం ముఖ్యం. దీనివల్ల ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోవచ్చు. ఆ వారం రోజుల్లోనే మీ ఇంటి చుట్టుపక్కల ఉండే కిరాణా షాపులు, మెడికల్ స్టోర్లు , అత్యవసర సేవల గురించి తెలుసుకోవడం వల్ల నగరంలో భయం పోతుందని ఆమె సూచించారు.
రెండో వారం: రవాణా , యాప్స్ వాడకం
రెండో వారంలో నగర రవాణా వ్యవస్థపై పట్టు సాధించాలి. బెంగళూరులో మెట్రో రైలు ప్రయాణం ఎంతో సులభం. అందుకే మెట్రో కార్డు తీసుకోవడం, అలాగే ర్యాపిడో (Rapido), ఉబెర్ (Uber) వంటి యాప్స్‌ను ఎలా వాడాలో నేర్చుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా బెంగళూరులో కన్నడ భాషలో కనీసం 'నమస్కార', 'ఎష్టు' (ఎంత?) వంటి చిన్న చిన్న పదాలు నేర్చుకుంటే ఆటో డ్రైవర్లు , స్థానికులతో కమ్యూనికేషన్ సులభం అవుతుంది.
మూడో వారం: ఆహారం , సామాజిక సంబంధాలు
మూడో వారంలో నగరంలోని వివిధ రకాల ఆహార రుచులను ఆస్వాదించాలి. స్థానిక హోటళ్లు, కేఫ్‌లు , మీ బడ్జెట్‌కు సరిపోయే మెస్‌లను గుర్తించాలి. అలాగే మీ ఆఫీసులో లేదా మీరు ఉంటున్న చోట కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడం వల్ల ఒంటరితనం పోతుందని ప్రియాంక వివరించారు. బెంగళూరులో నెట్‌వర్కింగ్ అనేది కెరీర్ గ్రోత్‌కు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
నాలుగో వారం: నగరాన్ని అన్వేషించడం
చివరి వారంలో నగరాన్ని ఒక పర్యాటకునిలా చూడాలి. కబ్బన్ పార్క్, లాల్ బాగ్ లేదా ఎంజీ రోడ్ వంటి ప్రదేశాలను సందర్శించడం వల్ల నగరంతో ఒక అనుబంధం ఏర్పడుతుంది. బెంగళూరులో స్ట్రగుల్ అవ్వడం అనేది చాలా సహజమని, కానీ ఒక పక్కా ప్లాన్ ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చని ఆమె భరోసా ఇచ్చారు.
ఎదేమైనా బెంగళూరు (Bengaluru) వంటి మెట్రో నగరాల్లో సెటిల్ అవ్వడం అనేది ఒక కళ. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది, కానీ ప్రియాంక చెప్పినట్లు వారాల వారీగా ప్రణాళిక వేసుకుంటే ఇబ్బందులు తగ్గుతాయి. నేడు వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం సమాచారం కోసమే కాదు, కొత్తగా వచ్చే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కూడా ఉపయోగపడుతోంది. మీరు కూడా బెంగళూరు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ కచ్చితంగా పాటించండి!


Click it and Unblock the Notifications