Debit Card: బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ కోసం గతంలో ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. బ్యాంకుల వరకు పరుగెత్తుకెళ్లి, క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరం ఉండేది. కానీ డెబిట్ కార్డుల ఎంట్రీతో ఈ తరహా బాధలకు చెక్ పడింది. అయితే ఇవి కేవలం మనీ విత్ డ్రా కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే అవుతుంది. ఈ కార్డుల ద్వారా పలు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ బెనిఫిట్స్ గురించి చాలామందికి తెలియదు. అవేంటో చూద్దాం..
కేవలం క్యాష్ విత్ డ్రా మాత్రమే కాకుండా ఆన్లైన్ సహా ఆఫ్లైన్ లావాదేవీలు డెబిట్ కార్డుల ద్వారా నిర్వహించవచ్చు. మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా పలు ఫీచర్లు సైతం ఈ కార్డులకు కల్పించబడ్డాయి. క్రెడిట్ కార్డులకు ఏమాత్రం తక్కువ కాకుండా వివిధ సౌకర్యాలను బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్నాయి.

ఇంటి నుంచి బయటికు వెళ్లేటప్పుడు, ప్రయాణాలు చేసే సమయంలోనూ నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డెబిట్ కార్డులు సహాయపడతాయి. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు నిల్వ ఆధారంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు దాదాపు ప్రతిచోటా ATM లేదా POS మెషిన్స్ అందుబాటులో ఉండటంతో.. డెబిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగింది. నగదు మాదిరిగా వీటికి దొంగల బెడద, మిస్ అయితే తిరిగి పొందలేదమనే తరహా ఇబ్బందులు ఉండవు.
నగదు ఉపయోగించి చేసే ఖర్చులను ట్రాక్ చేయడం చాలా కష్టం. కానీ డెబిట్ కార్డులతో వెచ్చించే ప్రతి రూపాయికి సంబంధిత బ్యాంకు ఖాతాలో ఎంట్రీ నమోదు అవుతుంది. తద్వారా ఖర్చులను అదుపు చేసుకొనే అవకాశం లభిస్తుంది. వీటికి తోడు పలు బ్యాంకులు అందించే ఓవర్ డ్రాఫ్ట్ లు, ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్ ద్వారా లబ్ధి పొందవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. క్రెడిట్ కార్డుల మాదిరిగానే వీటికీ రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలతో పాటు ప్రమాద, రక్షణ బీమా ప్రయోజనాలు సైతం లభిస్తాయి.


Click it and Unblock the Notifications