For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mutual Funds: మార్కెట్ హెచ్చుతగ్గుల్లోనూ ఎక్కువ రాబడి.. మ్యూచువల్ ఫండ్స్ లో ఇలా సూపర్ రిటర్స్న్..

|

Mutual Funds: స్టాక్ మార్కెట్లు కొన్నిసార్లు వరుసగా కొన్ని రోజుల పాటు పడిపోతూ బియరిష్ ట్రెండ్ లోనే కొనసాగుతూ ఉంటాయి. మరికొన్నిసార్లు మార్కెట్లు కొన్ని రోజుల పాటు నిరంతరం గరిష్ఠాలను తాకుతుంటాయి. మార్కెట్‌లో కదలిక ఏదైనా, అది పెట్టుబడిదారుల ఇన్వెస్ట్ మెంట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. అందుకే స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గుల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లయితే.. ఇందుకోసం బూస్టర్ సిప్ మార్గాన్ని ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

బూస్టర్ SIP అంటే ఏమిటి..

బూస్టర్ SIP అంటే ఏమిటి..

బూస్టర్ సిప్ మార్గం వల్ల మార్కెట్లు పతనంలో ఉన్నప్పుడు తక్కువ ఎన్ఏవీ ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఎక్కువ యూనిట్లను సేకరించేందుకు ఉపయోగపడుతుంది. దీనివల్ల చౌకగా యూనిట్లను పొందవచ్చు. ఇలా చేయటం వల్ల మార్కెట్లు పెరిగినప్పుడు తక్కువ ధరలో కొన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విలువ పెరుగుతుంది. అందువల్ల బూస్టర్ సిప్ విధానం విభిన్నంగా పనిచేస్తూ పెట్టుబడులపై మంచి రాబడులను అందిస్తుంది.

మన దేశంలోనూ అందుబాటులో..

మన దేశంలోనూ అందుబాటులో..

బూస్టర్ SIP అనేది మ్యూచువల్ ఫండ్‌లలో కొత్త ఆలోచన. ఇది ప్రస్తుతం మన దేశంలోనూ అందుబాటులో ఉంది. అయితే.. ఇప్పటివరకు దీనిని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ మాత్రమే ప్రారంభించింది. ఇది యాడ్-ఆన్ లాగా పనిచేసే ఫీచర్ అని చెప్పుకోవాలి. ఇది డైనమిక్‌గా ఎలా పెట్టుబడి పెట్టాలో ఇన్వెస్టర్లకు నేర్పుతుంది. సాధారణ SIPలతో పోలిస్తే బూస్టర్ విధానాన్ని వినియోగించటం వల్ల అధిక రాబడిని ఇస్తుంది.

 ప్రాధాన్య పథకంలో పెట్టుబడి..

ప్రాధాన్య పథకంలో పెట్టుబడి..

బూస్టర్ SIP ద్వారా ఇన్వెస్టర్ల డబ్బు ప్రాధాన్య పథకంలో వెళుతుందని మయాంక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన నితిన్ జఖారియా తెలిపారు. అది మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని ఆయన వెల్లడించారు. మార్కెట్ వాల్యుయేషన్ చౌకగా ఉంటే.. ఎంచుకున్న పథకంలో మీ పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. వాల్యుయేషన్ ఖరీదైనది అయితే ఆ పథకంలో మీ పెట్టుబడి తగ్గుతుంది. అంటే చౌకగా కొనడం, ఖరీదైనవి అమ్మడం అనే వ్యూహాన్ని ఈ ఫండ్ ఫాలో అవుతుంది.

సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా..

సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా..

బూస్టర్ SIP.. సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెడుతుంది. మీరు ఈక్విటీలో రూ.10 వేలు సిప్ రూపంలో పెట్టుబడి పెట్టినట్లయితే.. అది మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంది. కానీ ఆ సమయంలో కట్ అయిన మెుత్తం సొమ్ము పెట్టుబడి పెట్టబడదు. ఇది మొదట సోర్స్ స్కీమ్ అంటే డెట్‌కి వెళ్లి, ఆపై ఒక క్రమపద్ధతిలో ఈక్విటీ లేదా హైబ్రిడ్ టార్గెట్ స్కీమ్‌కి వెళుతుంది. ఇది మార్కెట్ వాల్యుయేషన్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. కాబట్టి.. దీర్ఘకాలంలో ఇది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని నిపుణులు అంటున్నారు.

English summary

Mutual Funds: మార్కెట్ హెచ్చుతగ్గుల్లోనూ ఎక్కువ రాబడి.. మ్యూచువల్ ఫండ్స్ లో ఇలా సూపర్ రిటర్స్న్.. | benefit from mutual fund investments in terms of return even in times of high market volatality with booster sip

benefit from mutual fund investments in terms of return even in times of high market volatality with booster sip
Story first published: Wednesday, June 29, 2022, 15:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X